యాప్నగరం

హిందూ పాక్ రిమార్క్: శశి థరూర్‌ కార్యాలయంపై దాడి

కాంగ్రెస్ నేత శశి థరూర్ చేసిన హిందూ పాకిస్థాన్ వ్యాఖ్యలపై బీజేవైఎం కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం (జులై 16) మధ్యాహ్నం థరూర్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు.

Samayam Telugu 16 Jul 2018, 8:02 pm
కాంగ్రెస్ నేత శశి థరూర్ చేసిన హిందూ పాకిస్థాన్ వ్యాఖ్యలపై బీజేవైఎం కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం (జులై 16) మధ్యాహ్నం థరూర్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. కార్యాలయానికి నల్ల రంగు పులిమారు. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే దేశాన్ని హిందూ పాకిస్థాన్‌గా మారుస్తుందంటూ కాంగ్రెస్‌ నేత శశి థరూర్‌ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి.
Samayam Telugu Shashi


బీజేవైఎం నిరసనలపై శశి థరూర్‌ స్పందించారు. ‘ప్రజలు తమ సమస్యలతో ముందుకొస్తే మీరు వారిని ఇలా భయపెడుతున్నారు.. దేశం కోరుకుంటోంది ఇదేనా?’ అని ఆయన ప్రశ్నించారు. తాను ఎంపీగా కాకుండా సాధారణ పౌరుడిలా అడుగుతున్నానని.. తనకుకు తెలిసిన హిందూయిజం ఇది కాదని ఆయన అన్నారు.

‘ఇది ప్రజాస్వామ్యంపై, భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి. వాళ్లు నన్ను చంపుతామని బెదిరించారు. నా కార్యాలయాన్ని తగులబెడతామని హెచ్చరించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశా’ అని శశి థరూర్ ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.