యాప్నగరం

మోడీకి త్రిపుల్ తలాక్ ఇచ్చిన రాజస్థాన్

అజ్మీర్, అల్వార్ పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు మండల్గర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల్లో బీజేపీ చిత్తు చిత్తుగా ఓడిపోగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీతో మూడు సీట్లను కైవలం చేసుకుంది.

TNN 3 Feb 2018, 3:16 pm
2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఢిల్లీ గద్దె ఎక్కిన మోడీ ఆతర్వాత వరుస విజయాలతో తనకు ఎదురే లేదని నిరూపించుకున్నారు. అయితే ఈ స్పీడుకు రాజస్థాన్ లో బ్రేకులు పడ్డాయి. సాధారణంగా ఉపఎన్నికల్లో అధికార పార్టీ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అటు ఢిల్లీలో ఇటు జైపూర్ లో తిరుగులేని మెజార్టీతో ఏలుతున్న కమలం పార్టీకి రాజస్థాన్ ఉపఎన్నికల ఫలితాలు మింగుడుపడడం లేదు. అజ్మీర్, అల్వార్ పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు మండల్గర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల్లో బీజేపీ చిత్తు చిత్తుగా ఓడిపోగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీతో మూడు సీట్లను కైవలం చేసుకుంది.
Samayam Telugu shatrughan sinhas triple talaq jibe at bjp following rajasthan defeat
మోడీకి త్రిపుల్ తలాక్ ఇచ్చిన రాజస్థాన్


తాజా ఎన్నికల ఫలితాలతో పార్టీలోని అసంతృప్తులకు అవకాశం చిక్కినట్లు అయింది. బీజేపీకి అజ్మీర్ తలాక్, అల్వార్ తలాక్, మండల్గర్ తలాక్ చేప్పేశాయి. ఈ త్రిపుల్ తలాక్ తర్వాత అయినా కళ్లు తెరవాలంటూ బీజేపీ ఎంపీ శతృఘన్ సిన్హా ట్వీట్ చేశారు. ఇప్పటికైనా కళ్లు తెరవక పోతే వచ్చే ఏడు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.


దేశవ్యాప్తంగా వరుస ఓటములతో కుంగిపోయిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గౌరవప్రదమైన ఓటమితో బలం పుంజుకున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ఉపఎన్నికల ఫలితాలపై ఆయనకు మరింత ఊరటనిచ్చాయి. దీంతో కార్యకర్తలను అభినందిస్తూ రాహుల్ ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.