యాప్నగరం

కేబినెట్ విస్తరణపై కస్సుబుస్సులు

నేడు జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణ అందిరికీ ఆమోదయోగ్యమేనా ? మిత్రపక్షాలు ఈ విస్తరణపై ఎలా...

TNN 3 Sep 2017, 4:11 pm
నేడు జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణపై ఎన్డీఏ మిత్రపక్షాలైన శివ సేన, జేడీ(యు) అంత సంతృప్తిగా లేవని తెలుస్తోంది. ఈ కేబినెట్ విస్తరణపై స్పందించిన శివసేన పార్టీ.. ఈ పరిణామాన్ని ఎన్డీఏకి చెందిన వ్యవహారంలా కాకుండా కేవలం బీజేపీకి చెందినదిగానే భావించాల్సి వుంటుంది అని అభిప్రాయపడింది. ఈ విషయంలో శివసేన పార్టీ బీజేపీపై విమర్శలు గుప్పించింది. అంతేకాకుండా తమ నిరసనని తెలియజేస్తూ శివసేన పార్టీ ఈ కేబినెట్ విస్తరణ కార్యక్రమానికి గైర్హాజరైంది.
Samayam Telugu shiv sena jdus reaction about union cabinet reshuffle
కేబినెట్ విస్తరణపై కస్సుబుస్సులు


ఇదిలావుంటే, నేడు కేబినెట్ విస్తరణ నేపథ్యంలో జరిగే ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకావాలని బీహార్‌లో జేడీ(యు) పార్టీ నేతలకి కనీసం ఆహ్వానాలు కూడా అందలేదు అని ఎద్దేవా చేశారు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్. తన మనుషులనే పక్కనపెట్టేవారిని వేరే వాళ్లు మాత్రం తమలో ఎందుకు కలుపుకుంటారు అని జేడీ(యు) అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్‌ తనదైన స్టైల్లో చురకలు అంటించే ప్రయత్నం చేశారు లాలూ ప్రసాద్ యాదవ్. దీంతో బీహార్‌లో తమతో కలిసి అధికారం పంచుకుంటున్న ఎన్డీఏ కేంద్రంలో తమపట్ల అవలంభించిన తీరుపై ఒకింత అసంతృప్తితోనే వున్నట్టు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.