యాప్నగరం

తల నరికినా.. గౌహతి బాట పట్టను: శివసేన నేత సంజయ్ రౌత్

మహారాష్ట్రలోని రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎమ్మెల్యేలు తిరుగుబావుటాతో శివసేన ప్రభుత్వం గందరగోళంలో పడింది. ఈ క్రమంలో సంజయ్ రౌత్ తనదైన శైలీలో రెబల్ ఎమ్మెల్యేలు, బీజేపీని టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఈడీ ఆయనకు ఓ షాక్ ఇచ్చింది. 2007 నాటి కేసులో ఆయనకు సమన్లు జారీ చేసింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ఇదొక కుట్ర అని అన్నారు. ఏం చేసినా తాను లొంగనని తేల్చి చెప్పారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 27 Jun 2022, 3:50 pm

ప్రధానాంశాలు:

  • 2007 నాటి కేసులో సంజయ్‌‌రౌత్‌కి ఈడీ నోటీసులు
  • రూ.1034 కోట్ల విలువైన ఛావల్ భూ కుంభకోణం
  • గతంలో సంజయ్ ఆస్తులను జప్తు చేసిన అధికారులు
  • శుభాకాంక్షలు చెప్పిన ఏక్‌నాథ్ షిండే కుమారుడు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu తల నరికినా.. గౌహతి బాట పట్టను: శివసేన నేత సంజయ్ రౌత్
మహారాష్ట్ర‌లోని సంక్షోభం తారాస్థాయికి చేరుకుంటుంది. ఎమ్మెల్యేల తిరుగుబావుటాతో మహా ప్రభుత్వం పతనం అంచున నించుంది. ఈ క్రమంలో శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్.. రెబల్ ఎమ్మెల్యేలపై విరుచుకుపడుతున్నారు. తనదైన శైలీలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ రగడ మధ్యలోనే ఆయనకు ఓ షాక్ తగిలింది. ఓ భూ కుంభకోణం కేసులో ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. దీనిపై సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదొక కుట్రగా అభివర్ణించారు.
ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందని, తాము బాలాసాహెబ్‌ శివసైనికులమని సంజయ్ అన్నారు. ఇప్పుడు పెద్ద యుద్ధం చేస్తున్నామని, ఇది తనను అడ్డుకునే కుట్ర అని అన్నారు. ఈ సందర్భంగా తనను చంపేసినా సరే.. గౌహతి బాటపట్టనని అన్నారు. "మహారాష్ట్రలో చాలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాము బాలాసాహెబ్ శివసైనికులం. ఇదొక కుట్ర. నా తల నరికినా, గౌహతి మార్గంలో వెళ్లను. నన్ను అరెస్ట్ చేయండి. జైహింద్" అని రౌత్ ట్వీట్ చేశారు.


ఇక సంజయ్ రౌత్‌కు 2007 నాటి కేసులో ఈడీ నోటీసులు జారీ చేసింది. రూ.1034 కోట్ల విలువైన ఛావల్ భూ కుంభకోణం కేసులో ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగా ఆయన ఆస్తులను ఈడీ ఏప్రిల్ నెలలో జప్తు చేసింది. అప్పుడు కూడా సంజయ్ రౌత్ ఇదే స్థాయిలో స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఏదైనా చేసుకోండి.. తాను భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఈ మనీలాండరింగ్ కేసు విచారణలోనే ప్రశ్నించడానికి రౌత్‌ను మంగళవారం పిలిచినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తెలిపారు.

మరోవైపు సంజయ్‌ రౌత్‌కు ఈడీ నోటీసులు పంపించడంపై ఏక్‌నాథ్ షిండే కుమారుడు ఎంపీ శ్రీకాంత్ షిండే.. వ్యంగ్యంగా స్పందించారు. ఈడీ సమన్ల నేపథ్యంలో సంజయ్ రౌత్‌కు తన శుభాకాంక్షలు అంటూ ప్రకటన చేశాడు. ఈ సందర్భంగా రెబల్ ఎమ్మెల్యేల విషయంలోనూ ఆయన స్పందించారు. కోర్టులో రెబల్స్ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు అన్ని చూస్తున్నారని, గమనిస్తున్నారని సరైన సమయంలో బదులిస్తారని అన్నారు. కాగా మహారాష్ట్రలో సాగుతున్న రాజకీయ సంక్షోభంపై మొదటి నుంచి సంజయ్ రౌత్ బీజేపీని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు నోటీసులు రావడం మరింత ఆసక్తిని పెంచింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.