యాప్నగరం

భారత్, పాక్ మధ్య నోట్ల రద్దు లొల్లి

నోట్ల రద్దు వ్యవహారం భారత్, పాక్ మధ్య దౌత్యపరమైన సమస్యలకు కారణమైంది. భారత్‌లోని తమ దౌత్య కార్యాలయ సిబ్బంది డబ్బును ..

TNN 3 Dec 2016, 12:49 pm
నోట్ల రద్దు వ్యవహారం భారత్, పాక్ మధ్య దౌత్యపరమైన సమస్యలకు కారణమైంది. భారత్‌లోని తమ దౌత్య కార్యాలయ సిబ్బంది డబ్బును డ్రా చేసుకోవడానికి ఆంక్షలు విధిస్తున్నారంటూ పాక్ ఆరోపించింది. దౌత్య సిబ్బందికి డాలర్ల రూపంలో వేతనాలను చెల్లించే పాక్ వాటిని దక్షిణ ఢిల్లీలోని బ్యాంకులో జమ చేస్తోంది. వారు ఆ డాలర్లను రూపాయల్లోకి మార్చుకొని తమ అవసరాలకు వాడుకుంటారు. అయితే గత వారం రోజులుగా పాక్ అధికారులు తన సొమ్మును విత్‌డ్రా చేయడంపై ఆంక్షలు పెరిగాయట. డాలర్లను మార్చుకోవడం కోసం, డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం కోసం ఖర్చుల వివరాలు చెప్పాలని బ్యాంకు వారిని కోరిందట. పాక్ అధికారులు దీన్ని అవమానంగా భావించారు. తమ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
Samayam Telugu shortage of dollars sparks diplomatic war between india and pakistan
భారత్, పాక్ మధ్య నోట్ల రద్దు లొల్లి


ఢిల్లీలోని తమ దౌత్య సిబ్బందిపై భారత విదేశాంగ శాఖ వ్యవహార శైలి మారకపోతే.. ఇస్లామాబాద్‌లోని భారత దౌత్యవేత్తలతో కూడా ఇదే తరహాలో వ్యవహరించాలని పాక్ యోచిస్తోంది. అయితే పాక్ దౌత్య సిబ్బంది విషయంలో ఉద్దేశపూర్వకంగా అలా చేయాలని భారత సీనియర్ అధికారులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.