యాప్నగరం

చిన్న ఫారం నింపండి, అపరాధ పన్ను కట్టండి

నల్లధనం కుబేరులు 50శాతం అపరాద పన్ను చెల్లింపులకు కేంద్రం కేవలం రెండే రెండు పేజీలు నింపే విధంగా అవకాశం కల్పించింది.

TNN 18 Dec 2016, 2:51 pm
నల్లధనం కుబేరులు 50శాతం అపరాద పన్ను చెల్లింపులకు కేంద్రం కేవలం రెండే రెండు పేజీలు నింపే విధంగా అవకాశం కల్పించింది. వచ్చే యేడాది మార్చిలోపు 50శాతం జరిమానాతో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద పన్ను చెల్లించాలని గడువు విధించిన సంగతి తెలిసిందే.
Samayam Telugu simple two page form to be filled under pmgky
చిన్న ఫారం నింపండి, అపరాధ పన్ను కట్టండి


వ్యాపార కార్యాలయం అడ్రస్, ఇంటి చిరునామా ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ అడ్రస్, పాన్ కార్డు నెంబర్ ఉంటే చాలు..బ్యాంకులు, పోస్టాఫీసుల్లో పన్ను చెల్లించవచ్చని ఆదాయపన్ను శాఖ తెలిపింది.

పన్ను చెల్లించే వారు ఆన్‌లైన్‌లోగానీ, ఆఫ్ లైన్ లోగానీ చెల్లించే అవకాశం కల్పించింది. పన్ను చెల్లించిన సదరు వ్యక్తులకు 30 రోజుల్లోపు డిక్లరేషన్ సర్టిఫికేట్ అందుతుంది.

పీఎంజీకేవై పథకం కింద చెల్లించే పన్నులు నాలుగేళ్లపాటు కేంద్రవద్దే ఉంటాయి. వీటిని ఇతరుల పేరుమీద మార్చడానికి వీల్లేదు. పన్ను చెల్లించే వ్యక్తి చనిపోయిన పక్షంలో వారసులు, నామినీకి అవి బదలాయించబడతాయి.

పన్నులు చెల్లించేవారు పాన్ గుర్తింపు కార్డు తప్పనిసరిగా కల్గి ఉండాలని లేని వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ లో పేర్కొంది. బ్యాంకుల్లో పన్నులు కట్టేవారి నుంచి ఏలాంటి ప్రాసెసింగ్ ఫీజుగానీ, కమీషన్ గానీ వసూలు చేయరని తెలిపింది.
ఈపథకం డిసెంబర్ 17 నుంచి అమల్లోకి రానుంది. లెక్కచెప్పని పన్నులు చెల్లించని వారికి 77.25శాతం జరిమాన విధిస్తామని రెవెన్యూ కార్యదర్శి హస్‌ముఖ్ అథియా తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.