యాప్నగరం

గౌరీ లంకేష్ హత్య కేసులో ఊహాచిత్రాలు విడుదల

సంచలనం రేపిన ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, యాక్టివిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసులో నిందితుల ఊహాచిత్రాలని విడుదల చేశారు...

TNN 14 Oct 2017, 5:54 pm
సంచలనం రేపిన ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, యాక్టివిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసులో నిందితుల ఊహాచిత్రాలని విడుదల చేశారు ఈ కేసుని దర్యాప్తు చేస్తోన్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) చీఫ్ బీకే సింగ్. రెండు ఊహాచిత్రాలతోపాటు గౌరీ లంకేష్‌ని హతమార్చిన సమయంలో ఆమె ఇంట్లోని సీసీటీవీ విజువల్స్ ఆధారంగా ఓ వీడియోను సైతం రిలీజ్ చేశారు. ఇందులో ఓ వ్యక్తి వైట్ కలర్ షర్ట్, బ్లాక్ కలర్ ప్యాంట్స్ ధరించి బైకుని నడిపించడాన్ని గమనించొచ్చు. ఈ ఊహాచిత్రాల్లోని వ్యక్తులు ఇధ్దరూ 25-35 ఏళ్ల మధ్య యువకులే. ఈ ఊహాచిత్రాల్లోని వ్యక్తులని పోలివున్న వాళ్లని ఎవరైనా, ఎక్కడైనా గుర్తిస్తే వెంటనే తమకి సమాచారం ఇవ్వాల్సిందిగా బీకే సింగ్ విజ్ఞప్తిచేశారు.
Samayam Telugu sit releases suspects sketches in gauri lankeshs murder case
గౌరీ లంకేష్ హత్య కేసులో ఊహాచిత్రాలు విడుదల


అనుమానితుల్లో ఒకరిని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి తమ వద్ద వున్నారు కానీ దర్యాప్తుగా సజావుగా సాగడం కోసం ఆ ప్రత్యక్ష సాక్షి వివరాలు వెల్లడించడం లేదని అన్నారు బీకే సింగ్. ఈ కేసుపై స్పందించే క్రమంలో కర్ణాటక రాష్ట్ర హోంశాఖ మంత్రి రామలింగా రెడ్డి మాట్లాడుతూ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వద్ద కొన్ని ఆధారాలున్నాయని చెప్పారు కానీ తాజాగా దీనిపై స్పందించిన బీకే సింగ్ మాత్రం నిందితుల వివరాలు తెలిపే ఆధారాలేవీ తమ వద్ద లేవని అన్నారు. అందుకే ఊహా చిత్రాల్లోని వ్యక్తులని పోలివున్న వ్యక్తులు ఎక్కడ కనిపించినా తమకి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నామని అన్నారు బీకే సింగ్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.