యాప్నగరం

ఎయిరిండియా విమానంలో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

Muscat airport: ఎయిరిండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. మస్కట్ నుంచి కొచ్చిన్ రావాల్సిన ఎయిరిండియా (Air India) ఎక్స్‌ప్రెస్ విమానంలో (IX-442, VT-AXZ) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రన్‌వేపై బయల్దేరడానికి సిద్ధమవుతుండగా మంటలు చెలరేగి దట్టమైన పొగ అలుముకుంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానంలో ఉన్న 141 మంది ప్రయాణికులను, ఆరుగురు క్రూ సిబ్బందిని సురక్షితంగా కిందకి తీసుకొచ్చారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని మస్కట్ ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 14 Sep 2022, 3:38 pm
Samayam Telugu ​Air India Flight smoke accident
ఎయిరిండియా విమానం
యిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. మస్కట్ నుంచి కొచ్చిన్ రావాల్సిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో (IX-442, VT-AXZ) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా రన్‌వేపై మంటలు చెలరేగి, విమానం చుట్టూ దట్టమైన పొగ అలుముకుంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. విమానంలో ఉన్న 141 మంది ప్రయాణికులను, ఆరుగురు క్రూ సిబ్బందిని సురక్షితంగా కిందకి తీసుకొచ్చారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని మస్కట్ ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.


రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.