యాప్నగరం

మిడ్ డే మీల్స్‌లో పాము పిల్ల

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకి అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఇప్పటికే అనేక ఆరోపణలు, అనుమానాలు...

TNN 12 May 2017, 10:56 am
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకి అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఇప్పటికే అనేక ఆరోపణలు, అనుమానాలు వున్నాయి. ఈ ఆరోపణలకి బలం చేకూర్చుతూ తాజాగా హర్యానాలోని ఫరీదాబాద్‌లో మరో ఉదంతం వెలుగుచూసింది. ఫరీదాబాద్‌లోని రాజ్‌కీయ గాళ్స్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో గురువారం మధ్యాహ్నం విద్యార్థినులకి వడ్డించే మధ్యాహ్న భోజనంలో పాము పిల్ల కనిపించడం కలకలం రేపింది.
Samayam Telugu snake found in mid day meal served at faridabad government school
మిడ్ డే మీల్స్‌లో పాము పిల్ల


స్కూల్ ప్రిన్సిపల్, టీచర్లు భోజనం చేసే సమయంలో వంట పాత్రలో పాము పిల్ల పడి వుండటం గమనించారు. వెంటనే మిగతా విద్యార్థినులని సైతం అప్రమత్తం చేస్తూ ఎవ్వరినీ ఆహారం తీసుకోవద్దని హెచ్చరించారు. కానీ అప్పటికే కొంతమంది విద్యార్థినులు భోజనం చేసి వుండటం, వారు వాంతులు చేసుకోవడం జరిగిపోయింది.

ఈ ఘటనపై స్పందించిన విద్యార్థినులు.. రోజూ తాము తినే ఆహారంలో ఏదో పాచిపోయిన వాసనొస్తుంటుంది కానీ మరీ ఇలా పాము పిల్ల ఆహారంలో పడటం అనేది మాత్రం చాలా భయాన్ని కలిగిస్తోంది అని ఆందోళన వ్యక్తంచేశారు. జరిగిన ఘటనపై ఉన్నతాధికారులతోపాటు మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తోన్న ఇస్కాన్ ఫుడ్ రిలీఫ్ ఫౌండేషన్‌కి సైతం సమాచారం అందించారు స్కూల్ ప్రిన్సిపల్ బ్రజ్ బాలా.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.