యాప్నగరం

600 మంది ఉద్యోగులను తొలగించనున్న స్నాప్‌డీల్!

ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న ఇ-కామర్స్‌ సంస్థ స్నాప్‌డీల్‌ నష్ట నివారణ చర్యలు చేపట్టింది.

TNN 25 Feb 2017, 8:26 pm
ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న ఇ-కామర్స్‌ సంస్థ స్నాప్‌డీల్‌ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. దీంట్లో భాగంగా 600 మంది ఉద్యోగులను తొలగించనుంది. ఇప్పటికే కొంత మందికి పింక్‌ స్లిప్‌ కూడా ఇచ్చిందట. క్రమంగా.. మార్చి చివరి వరకూ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను కొనసాగించనుందని ఉద్యోగులు భావిస్తున్నారు.
Samayam Telugu snapdeal issues pink slips to lay off 600 employees
600 మంది ఉద్యోగులను తొలగించనున్న స్నాప్‌డీల్!


సంస్థలో సమస్యకు కారణం వృద్ధి మందగమనం. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లతో స్నాప్‌డీల్‌‌కు తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. ఇంతకుముందులా అది లాభాలను ఆర్జించలేకపోతోంది. దీంతో ఉద్యోగులను తొలగించడానికి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు జాబ్‌కు రెసిగ్నేషన్ ఇచ్చి ల్యాప్‌టాప్‌‌లు, గుర్తింపుకార్డులను తిరిగి ఇచ్చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.