యాప్నగరం

గిన్నీస్ బుక్‌లో రాహుల్ గాంధీ!

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌‌కు ఎక్కనున్నారు! ‘‘ప్రపంచంలో ఏ నేత సాధించలేని ఘనతను ఆయన సాధించారు.....

TNN 22 Mar 2017, 1:35 pm
ఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌‌కు ఎక్కనున్నారు! ‘‘ప్రపంచంలో ఏ నేత సాధించలేని ఘనతను ఆయన సాధించారు. తప్పకుండా రికార్డుల్లో ఆయన పేరు ఉండాల్సిందే’’ అని ఓ విద్యార్థి గిన్నీస్ బుక్‌కు దరఖాస్తు చేశాడు. దీంతో, ‘‘రాహుల్ గాంధీ ప్రధాని కావచ్చు, కాకపోవచ్చు. కానీ, ఆయన గిన్నీస్ బుక్‌లో తప్పకుండా స్థానం సాధిస్తారు’’ అని.. పూర్తిగా ‘మేటర్’ తెలియని రాహుల్ అనుచరులు కొందరు సంబరపడుతున్నారు. పాపం అసలు విషయం తెలిస్తే... ఏమైపోతారో.
Samayam Telugu someone just proposed rahul gandhis name to guinness book for losing most number of elections
గిన్నీస్ బుక్‌లో రాహుల్ గాంధీ!


ఇంతకీ ‘మేటర్’ ఏమిటంటే... మధ్య ప్రదేశ్‌కు చెందిన విశాల్ ధవన్ అనే ఇంజినీరింగ్ స్టూడెంట్, రాహుల్ గాంధీలోని ఓ ప్రత్యేకతను గుర్తించాడు. ప్రపంచంలో మరే నేత 27 ఎన్నికల్లో ఓటమి చెందలేదని, తప్పకుండా మా రాహుల్ గాంధీ పేరును రికార్డుల్లో చేర్చాలని గిన్నీస్ బుక్‌కు దరఖాస్తు చేశాడు. అయితే, దీనిపై గిన్నీస్ బుక్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.