యాప్నగరం

యూపీలో సోనియా ప్రచారం చేయరు

ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ముందు రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి.

TNN 31 Jan 2017, 6:02 pm
ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ముందు రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకుని ఎలాగైనా గెలిచి అధికారాన్ని సొంతం చేసుకోవాలని పట్టుదల మీద ఉన్నాయి. అఖిలేష్ ఎన్నికల ప్రచారంలో ప్రతి చోటా తమ కూటమి గెలుపు తథ్యమని చెబుతూ వస్తున్నారు. అయితే అఖిలేష్ తండ్రి ములాయం మాత్రం తాను ఎన్నికల ప్రచారానికి రానని తెగేసి చెప్పారు. కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం తనకు ఇష్టం లేదని బహిరంగంగానే చెప్పారు. తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి రారని ఆ పార్టీ ప్రతినిధులు వెల్లడించారు. దీంతో కాంగ్రెస్-ఎస్పీ కూటమి కాస్త నిరాశకు లోనైంది. ములాయం, సోనియా కూడా వచ్చి ప్రచారం చేస్తే కూటమికి మరింత బలం చేకూరేదని నేతలు భావించారు.
Samayam Telugu sonia gandhi not to campaign in uttarapradesh polls
యూపీలో సోనియా ప్రచారం చేయరు


సోనియా రాకపోవడానికి ఆమె అనారోగ్యమే కారణంగా తెలుస్తోంది. ఏడాది కాలంగా ఆమె తరచూ అస్వస్థతకు గురవుతోంది. అమెరికాలో చికిత్స తీసుకుని వచ్చాక కూడా పరిస్థితి అలాగే ఉంది. దీంతో ఆమె ప్రచారానికి రాకూడదని నిర్ణయించుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.