యాప్నగరం

ముస్లిం వివాదం: గుండు కొట్టించుకున్న సోను నిగమ్

మసీదుల్లో ఉదయం ప్రార్థనలకు లౌడ్ స్పీకర్లను వాడటంపై వివాదాస్పద ట్వీట్లు చేసిన ప్రముఖ గాయకుడు సోను నిగమ్ తన వాదనపై గట్టిగా నిలబడుతున్నారు.

TNN 19 Apr 2017, 4:16 pm
మసీదుల్లో ఉదయం ప్రార్థనలకు లౌడ్ స్పీకర్లను వాడటంపై వివాదాస్పద ట్వీట్లు చేసిన ప్రముఖ గాయకుడు సోను నిగమ్ తన వాదనపై గట్టిగా నిలబడుతున్నారు. ఈ వివాదంపై తనకు ఫత్వా జారీచేసిన పశ్చిమ బెంగాల్‌లోని మతపెద్దకు సవాల్ విసిరిన సోనూ నిగమ్ అన్నంత పనీ చేశారు. సోనూకి గుండు గీయించినవారికి తాను రూ. 10 లక్షలు ఇస్తానని ఆ ముస్లిం మత పెద్ద ప్రకటించారు. దీన్ని సవాల్‌గా తీసుకున్న సోనూ బుధవారం మీడియాను తన ఇంటికి పిలిచి ‘గుండు కొట్టించుకుంటా.. రూ. 10 లక్షలు సిద్ధం చేసుకో’మని మతపెద్దకు సవాల్ విసిరారు.
Samayam Telugu sonu nigam shaves off his head insists that hes not anti muslim
ముస్లిం వివాదం: గుండు కొట్టించుకున్న సోను నిగమ్


అన్నట్టుగానే సెలబ్రిటీ హెయిర్‌స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్‌ను తన ఇంటికి పిలుపించుకుని గుండు కొట్టించుకున్నారు సోనూ. తనపై ముస్లిం వ్యతిరేకి అని ముద్ర వేయడంపై సోనూ ఘాటుగా స్పందించారు. ‘మహమ్మద్ రఫీని నేను గురువుగా భావిస్తాను. నా డ్రైవర్ ఒక ముస్లిం. నేను ముస్లిం వ్యతిరేకిని కాను. నేను లౌకికవాదిని’ అని సోనూ చెప్పారు. తాను ట్వీట్ చేసింది కూడా సామాజిక కోణంలోనేనని అంతేకాని దానిలో ఎలాంటి మతపరమైన కోణం లేదని వివరణ ఇచ్చారు.

గుండెందుకు కొట్టించుకున్నారని విలేకరులు అడగగా.. ‘ఇది ఉద్యమం కాదు, అలా అని సవాలు కూడా కాదు. వాళ్ల అన్నదానికే నేను చేసి చూపించాను. నాకు గుండు కొట్టింది కూడా ఓ ముస్లిం అనే సంగతి వాళ్లకు చెప్పడానికే ఇలా చేశాను. దీన్ని మీడియా కూడా వివాదాస్పదం చేయకూడదు’ అని సోనూ చెప్పారు. కాగా, ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడంటూ సోను నిగమ్‌పై ముస్లిం మతపెద్దలు తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే కోల్‌క‌తాలోని ఓ ముస్లిం మ‌త‌పెద్ద.. సోనూకి ఎవ‌రైతే గుండుకొట్టించి, అత‌ని మెడ‌లో పాత చెప్పుల దండ వేసి దేశ‌మంతా ఊరేగిస్తారో వారికి రూ.10 లక్షలు ఇస్తాన‌ని చెప్పాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.