యాప్నగరం

దేశీ విమాన ప్రయాణానికి ఇకపై పాస్ట్‌పోర్ట్!

ఇప్పటి వరకు విదేశీ ప్రయాణాలకే అవసరమైన పాస్ట్‌పోర్ట్ ఇకపై దేశీ ప్రయాణాలకి కూడా అవసరం కానుంది.

TNN 9 Apr 2017, 11:20 am
ఇప్పటి వరకు విదేశీ ప్రయాణాలకే అవసరమైన పాస్ట్‌పోర్ట్ ఇకపై దేశీ ప్రయాణాలకి కూడా అవసరం కానుంది. భారత్‌లో విమాన ప్రయాణం చేయనున్న వారికి కూడా పాస్‌పోర్ట్ లేదా ఆధార్ తప్పనిసరి చేయాలని విమానయాన శాఖ నిర్ణయించింది. మరో రెండు మూడు నెలల్లో దీన్ని అమల్లోకి తీసుకురానుంది. దీని ప్రకారం దేశీ విమాన టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు ప్రయాణికులు తమ ఆధార్ లేదా పాస్ట్‌పోర్ట్ నంబర్‌ను చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ నిర్ణయం‌పై ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకోవాలని విమానయాన శాఖ నిర్ణయించింది.
Samayam Telugu soon you will need aadhaar or passport for flights in india
దేశీ విమాన ప్రయాణానికి ఇకపై పాస్ట్‌పోర్ట్!


వచ్చే వారం నుంచి ప్రజాభిప్రాయాలను సేకరించడానికి సన్నహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ అభిప్రాయాలను 30 రోజులపాటు తీసుకోనున్నారు. దీన్ని బట్టి జూన్ లేదా జులై నెలలో కొత్త నిబంధనను అమలులోకి తీసుకురానున్నారు. విమానాల్లో ప్రయాణికుల తీరు, సిబ్బందిపై వారి ప్రవర్తన వంటి విషయాలను భద్రపరచడానికి ఈ కొత్త నిబంధనను తీసుకువస్తున్నారు. ఆధార్ లేదా పాస్‌పోర్ట్ ఆధారంగా ప్రయాణికుల ప్రవర్తనను రికార్డ్ చేస్తారు. నాలుగు సార్లకు మించి ప్రయాణికుడు నేరానికి పాల్పడితే అతన్ని బ్యాన్ చేస్తారు.

ఇదిలా ఉండగా.. ఎయిర్ ఇండియా మేనేజర్‌పై శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ చేయిచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన తరవాత రవీంద్ర గైక్వాడ్‌పై దేశీ విమానయాన సంస్థలన్నీ నిషేధం విధించాయి. లోక్‌సభలో గైక్వాడ్ క్షమాపణలు చెప్పడంతో నిషేధాన్ని ఎత్తివేయాలని విమానయాన శాఖ దేశీ విమానయాన సంస్థలను ఆదేశించింది. అయితే ఈ విషయంలో దేవీ విమానయాన సంస్థలు ఇంకా అసంతృప్తిగానే ఉన్నాయట. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో మళ్లీ తలెత్తకుండా ఉండాలంటే దేశీ విమానాల్లో ప్రయాణికులకు గుర్తింపు నిబంధనను తీసుకురావాలని విమానయాన శాఖ నిర్ణయించినట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.