యాప్నగరం

నాన్నా..ఒక్క మాట చెబితే రిజైన్ చేసేవాడిని!

‘నేతాజీ (ములాయం సింగ్ యాదవ్) ...మీరు నన్ను రాజీనామా చేయాలని ఒక్క మాట చెబితే ఇట్టే చేసి ఉండేవాడిని.

TNN 24 Oct 2016, 12:52 pm
‘నేతాజీ (ములాయం సింగ్ యాదవ్) ...మీరు నన్ను రాజీనామా చేయాలని ఒక్క మాట చెబితే ఇట్టే చేసి ఉండేవాడిని. అన్యాయంపై పోరాడాలని మీరే నాకు నేర్పారు. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మీరే. నేనేందుకు కొత్త పార్డీ పెడతాను? ఎస్పీని బలోపేత చేయడం నా బాధ్యత’ అని యూపీ సీఎం, ఎస్పీ అధినేత ములాయం తనయుడు అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు.
Samayam Telugu sp pariwar akhilesh breaks down lauds father and turn down amar singh
నాన్నా..ఒక్క మాట చెబితే రిజైన్ చేసేవాడిని!


సోమవారం ఉదయం పార్టీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడుతూ ఆయన కంటతడి పెట్టుకున్నారు. అమర్ సింగ్ తో కలిసి తనకు వ్యతిరేకంగా బాబాయ్ శివపాల్ యాదవ్ కుట్రపన్నారని అఖిలేష్ ఆరోపించారు.

తనను తొలగించాలంటే ములాయం సింగ్ కే ఆ అధికారం ఉందని, ఇతర వ్యక్తులు (అమర్ సింగ్) జోక్యం చేసుకుంటే ఊర్కునేది లేదని ఆయన అన్నారు.

ములాయం సింగ్ కు త్వరలో కుట్రదారులు ఎవరో తెలిసిపోతుందని చెప్పిన అఖిలేష్....పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని...తండ్రి మాట వింటానని చెప్పారు.

మరోవైపు తన వర్గం నేతలతో సమావేశమైన ములాయం సింగ్ యాదవ్...తమ్ముడు శివపాల్ యాదవ్..అమర్ సింగ్ లను వెనకేసుకొచ్చారు. పార్టీని కష్టకాలంలో నిలబెట్టిన వీరిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.