యాప్నగరం

ఎస్పీ సంక్షోభం: కేబినేట్ నుంచి శివపాల్ ఔట్

కడపటి వార్తలు అందే సమయానికి అఖిలేష్ యాదవ్ సమావేశానికి 65మంది ఎమ్మెల్యేలు, 35మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు

TNN 23 Oct 2016, 12:25 pm
ఉత్తర్ ప్రదేశ్‌ సమాజ్ వాదిపార్టీలో సంక్షోభం ముదిరింది. చీలిక అనివార్యమైంది. తన వర్గం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం అఖిలేష్ యాదవ్ లక్నోలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అమర్ సింగ్ సన్నిహిత సభ్యులు ఎవరూ హాజరుకాకుడదని తమ నేత, సీఎం అఖిలేష్ యాదవ్ స్పష్టం చేసినట్లు మెయిన్ పురి ఎమ్మెల్యే రాజు యాదవ్ చెప్పారు. ములాయం టీం మెంబర్లను తన కేబినేట్ నుంచి తొలగించాలని అఖిలేష్ నిర్ణయించారు.
Samayam Telugu sp rift shivpal and 3 other ministers sacked by akhilesh
ఎస్పీ సంక్షోభం: కేబినేట్ నుంచి శివపాల్ ఔట్


ములాయం శిబిరంలో ఉన్న తన బాబాయ్, శివపాల్ యాదవ్ సహా ఆరుగురు మంత్రులను తన కేబినేట్ నుంచి తొలగించారు. ఎమ్మెల్యేలతో సమావేశం ముగిశాక నేరుగా గవర్నర్ కు మంత్రుల తొలగింపును సిఫార్సు చేయాలని అఖిలేష్ నిర్ణయించారు.

కేబినేట్ నుంచి శివ్ పాల్ సహా ఓం ప్రకాశ్ సింగ్, నారద రాయ్, సదాబ్ ఫాతిమా, బలరామ్ యాదవ్ లను మంత్రివర్గం నుంచి తొలగించినట్లు మంత్రి రామ్ కరణ్ యాదవ్ మీడియాతో చెప్పారు.

కడపటి వార్తలు అందే సమయానికి అఖిలేష్ యాదవ్ సమావేశానికి 65మంది ఎమ్మెల్యేలు, 35మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

సమావేశం అనంతరం అఖిలేష్‌కు మద్దతుగా సిగ్నేచర్ క్యాంపెయిన్ చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే సుభాష్ మిశ్రా తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.