యాప్నగరం

ఖతార్‌లో‌ని భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు

ఐఎస్ తీవ్రవాదులకు సహకరిస్తుందనే కారణంతో సౌదీ, యూఏఈ, బహ్రెయిన్‌ సహా ఏడు గల్ఫ్ దేశాలు ఖతార్‌తో దౌత్య సంబంధాలు తెంచుకోవడంతో సంక్షోభం తలెత్తింది.

TNN 22 Jun 2017, 11:12 am
ఖతార్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించడానికి కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక విమాన సర్వీసులను నడపనుంది. దీనిపై పౌర విమానయాన శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. కేరళ, దోహ మధ్య ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ జూన్ 25 నుంచి జులై 8 వరకు 186 సీట్ల సామర్థ్యం గల 737 ప్రత్యేక విమానాలను నడుపుతుందని తెలిపారు. అలాగే జెట్ ఎయిర్‌వేస్ కూడా ముంబయి, దోహా మధ్య గురు, శుక్రవారాల్లో 168 సీట్ల సామర్థ్యం గలిగిన బోయింగ్ 737 విమానాలను నడపనున్నట్లు తెలియజేశారు. దీనిపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుతో సోమవారం భేటీ అయి దోహలో చిక్కుకుపోయిన పౌరులను స్వదేశానికి రప్పించడం కోసం ప్రత్యేకంగా కొన్ని విమానాలను నడపాలని కోరారు.
Samayam Telugu special flights to airlift indians stuck in blockade hit qatar
ఖతార్‌లో‌ని భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు


దీంతో అదనపు విమానాలను నిర్వహించాలని నిర్ణయించుకున్న మంత్రి విమానయాన సంస్థలతో మాట్లాడారు. ఖతార్‌లోని భారతీయులను సకాలంలో స్వదేశానికి తిరిగి చేర్చడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విమానయాన మంత్రిత్వశాఖ పేర్కొంది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, బహ్రెయిన్‌తో సహా ఏడు దేశాలు ఖతార్‌తో దౌత్యపరమైన సంబంధాలను తెంచుకున్న విషయం తెలిసిందే. దీంతో సౌదీ, ఖతార్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రెండు దేశాల మధ్య సరిహద్దులను కూడా మూసేశారు. ఖతార్‌లో సుమారు 7 లక్షల మంది భారతీయులు ప్రస్తుతం నివసిస్తున్నారు. భారతీయులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. అందుకే వీలైనంత తొందరగా వారిని స్వదేశానికి రప్పించనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.