యాప్నగరం

బురదలో ఇరుక్కున్న స్పైస్‌జెట్ విమానం

దేశీ విమాయాన సంస్థ స్పైస్‌జెట్‌కు చెందిన ఓ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది.

TNN 20 Sep 2017, 12:08 pm
దేశీ విమాయాన సంస్థ స్పైస్‌జెట్‌కు చెందిన ఓ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. రన్‌వేపై దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు జారిపోయి బురదలో కూరుకుపోయింది. ఈ ఘటన ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేపై చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఎయిర్‌పోర్టు ప్రధాన రన్‌వే తడిసి ముద్దయింది. వరద నీరు చేరడంతో రన్‌వే పక్కన విపరీతంగా బురద చేరింది. అయితే మంగళవారం రాత్రి వారణాసి నుంచి 183 మంది ప్రయాణికులతో వచ్చిన ఈ విమానం ల్యాండ్‌ అయ్యే క్రమంలో రన్‌వే నుంచి పక్కకు జారి బురదలో ఇరుక్కుపోయింది.
Samayam Telugu spicejet flight overshoots mumbai airport runway lands in mud
బురదలో ఇరుక్కున్న స్పైస్‌జెట్ విమానం


వెంటనే అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా కిందికి దించారు. అత్యవసర ద్వారం నుంచి బయటకు పంపించారు. భారీ వర్షం కారణంగా రన్‌వే నీట మునగడంతో విమానాన్ని అక్కడే ఉంచేశారు. ప్రధాన రన్‌వేను తాత్కాలికంగా మూసేశారు. దీంతో ముంబై రావాల్సిన 56 విమానాలను దారి మళ్లించారు. కాగా, మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ముంబై జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లు నదులను తలపించాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.