యాప్నగరం

DMK వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన స్టాలిన్

డీఎంకే అధినేత కరుణానిధి అనారోగ్యం బాధపడుతుండటంతో తనయుడు ఎంకే స్టాలిన్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు.

TNN 4 Jan 2017, 10:23 am
డీఎంకే అధినేత కరుణానిధి అనారోగ్యం బాధపడుతుండటంతో తనయుడు ఎంకే స్టాలిన్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. స్టాలిన్ ఇప్పటి వరకు పార్టీ కోశాధికారిగా వ్యవహరించారు.
Samayam Telugu stalin appointed working president for dmk
DMK వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన స్టాలిన్


కరుణానిధి (92) ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.

బుధవారం ఉదయం పార్టీ కార్యాలయంలో సమావేశమైన దాదాపు 3000 వేల మంది కీలక నేతలు స్టాలిన్ ను జనరల్ సెక్రెటరీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి కరుణానిధి హాజరుకాలేదు. కానీ పార్టీ సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని నేతలు ఆయనకు తెలియజేసి..ఆయన ఆమోదంతోనే స్టాలిన్ నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు.

డిసెంబర్ 5న జయలలిత మరణించాక..తమిళనాడు రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. ఆమె నెచ్చెలి శశికళ అన్నాడీంఎకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఓ. పన్నీరు సెల్వం సీఎంగా కొనసాగుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.