యాప్నగరం

నేడు రాష్ట్రపతిని కలవనున్న డీఎంకే బృందం

పళనిసామి ప్రభుత్వం అప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైందని అలాంటి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ తమిళనాడు

Samayam Telugu 23 Feb 2017, 11:04 am
పళనిసామి ప్రభుత్వం అప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైందని అలాంటి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ తమిళనాడు ప్రతిపక్ష డీఎంకే నేతలు నేడు (గురువారం) రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. ఈ బృందానికి డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ నాయకత్వం వహిస్తున్నారు.
Samayam Telugu stalin team to meet president pranab today
నేడు రాష్ట్రపతిని కలవనున్న డీఎంకే బృందం


ఈ నెల 18న సీఎం పళనిసామి బల పరీక్ష సందర్భంగా అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. రహస్య ఓటింగ్ కు డీఎంకే, కాంగ్రెస్, ముస్లింలీగ్, పన్నీరు సెల్వం (11మంది ఎమ్మెల్యేలు) వర్గం పట్టుబట్టింది. డీఎంకే సభ్యులు స్పీకర్ పై దౌర్జన్యానికి దిగారు. దీంతో ఆగ్రహించిన స్పీకర్ డీఎంకే సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేసి..బహిరంగ ఓటింగ్ కు అనుమతించారు. బహిరంగ్ ఓటింగ్ లో పళనిసామి ప్రభుత్వానికి అనుకూలంగా 122ఓట్లు దక్కి ఆయన సర్కారు విశ్వాస పరీక్షలో నెగ్గింది.

అయితే ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేసి బలపరీక్ష నిర్వహించడం అప్రజాస్వామికం అంటూ..మళ్లీ విశ్వాసపరీక్షను జరపాలని కోరుతూ స్టాలిన్ గవర్నర్ విద్యాసాగర్ రావును కలిశారు. గవర్నర్ నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఇదే అంశంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని స్టాలిన్ టీం ఢిల్లీ బయలుదేరింది.

‘‘తమిళనాడు అసెంబ్లీలో జరిగిన గలాటపై గవర్నర్ కు ఫిర్యాదు చేశాం. ఇదే పరిస్థితిపై రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేయబోతున్నాం’’ అని స్టాలిన్ మీడియాతో చెప్పారు.

పళనిసామి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డీఎంకే బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజు దీక్షలు నిర్వహించింది.

పళనిసామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలుచేసిన పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు స్పందించింది. తమిళనాడు అసెంబ్లీలో జరిగిన సంఘటనపై వీడియో ఫుటేజీ సమర్పించాలని డీఎంకేకు సూచించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.