యాప్నగరం

న్యూయార్క్ టైమ్స్‌స్క్వేర్‌ వద్ద ‘అయోధ్య వేడుకలు’ లేనట్లేనా?

New York: అయోధ్యలో రామ మందిర నిర్మాణ భూమి పూజ సందర్భంగా న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ వద్ద శ్రీరాముడి భారీ చిత్రపటాన్ని ప్రదర్శించడానికి ప్రవాస భారతీయులు ఏర్పాట్లు చేశారు. అయితే.. ముస్లిం సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇది ప్రశ్నార్థకంగా మారింది.

Samayam Telugu 4 Aug 2020, 3:33 pm
అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రపంచంలోని కోట్లాది మంది హిందువుల కల. ఆ అపురూప ఘట్టానికి బుధవారం (ఆగస్టు 5) అంకురార్పణ పడుతోంది. ఈ సందర్భంగా దేశ, విదేశాల్లోని పలు నగరాల్లో ఈ వేడుకలను నిర్వహించడానికి హిందూ సంఘాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో ప్రఖ్యాత టైమ్స్‌స్క్వేర్‌ వద్ద పలు కార్యక్రమాలను తలపెట్టారు. దీపాలను వెలిగించడం, భజన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పలువురు వక్తలతో అక్కడ ప్రసంగాలు ఏర్పాటు చేసినట్లు అమెరికాలోని భారతీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు జగదీశ్ సెవానీ తెలిపారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Ayodhya Bhoomi Puja


అయోధ్య భూమిపూజ కార్యక్రమాన్ని పురస్కరించుకొని శ్రీరాముడి ఫోటోలు, వీడియోలు, జైశ్రీరామ్‌ పదాలను టైమ్‌ స్క్వేర్‌ వద్ద ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో ఈ ప్రకటనలను ప్రదర్శిస్తారని ఇప్పటికే ప్రకటించారు. అయితే అమెరికాలోని ముస్లిం సంస్థలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాయి.

Lord Rama Photo on Times Square


టైమ్ స్క్వేర్ వద్ద ఒక మతానికి అనుకూలంగా ప్రకటనలను ప్రదర్శించడం సరికాదని ముస్లిం సంస్థలు పేర్కొన్నాయి. న్యూయార్క్‌ గవర్నర్‌, మేయర్‌, నగర పాలక మండలి, చట్టసభ్యులతో పాటు ఆ యాడ్‌ కంపెనీపై ఒత్తిడి తీసుకొచ్చాయి. దీంతో అయోధ్య భూమిపూజ ప్రకటలను టైమ్స్‌స్క్వేర్‌ వద్ద ప్రదర్శించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రకటనల బోర్డులను నిర్వహించే కంపెనీ ఈ విషయాన్ని చెప్పినట్లు స్థానిక మీడియా కథనాల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టైమ్ స్క్వేర్ వద్ద తలపెట్టిన ఇతర కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయా? లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

మరోవైపు.. అయోధ్య భూమి పూజ సందర్భంగా టైమ్స్ స్క్వేర్ వద్ద శ్రీరాముడి భారీ చిత్రపటాన్ని ప్రదర్శించారంటూ సోషల్ మీడియాలో ఇప్పటికే కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అవన్నీ మార్ఫింగ్ ఫోటోలేనని మీడియా కథనాలు పేర్కొన్నాయి.

Lord Rama Photo


Also Read: పిల్లల ‘టీవీ’ పాఠాల కోసం తాళి తాకట్టు పెట్టిన తల్లి

Must Read: ముస్లిమే.. కానీ, రాముడంటే ప్రాణం, మందిరం నిర్మాణానికి మట్టితో బయల్దేరాడు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.