యాప్నగరం

ఎన్టీఆర్, చిరంజీవి రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు!

దక్షిణాదిన చాలా మంది సినీ హీరోలు రాజకీయాల్లోకి వచ్చారని.. వారిలో

TNN 23 May 2017, 10:23 am
సినిమా వాళ్ల తలల్లో ఏమీ గుజ్జు ఉండదు, వాళ్లకు చదువు ఉండదు.. వ్యవస్థను నాశనం చేస్తారు.. అంటూ ధ్వజమెత్తారు బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి. తమిళ స్టార్ హీరో రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఒక టీవీ చానల్ తో మాట్లాడుతూ.. సినీ నటుల రాజకీయాలపై స్వామి తీవ్రమైన విమర్శలు చేశారు. వారు రాజకీయాల్లోకి రావడం వేస్ట్ అని తేల్చేశారు స్వామి. అంతే కాదు.. కొంతమంది సినీ నటుల పేర్లను ప్రస్తావించి మరీ స్వామి విమర్శలు చేశారు.
Samayam Telugu subramanian swamy on rajinikanth joining politics
ఎన్టీఆర్, చిరంజీవి రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు!


దక్షిణాదిన చాలా మంది సినీ హీరోలు రాజకీయాల్లోకి వచ్చారని.. వారిలో ఫెయిల్యూర్ స్టోరీస్ ను కలిగిన వారే ఎక్కువని స్వామి వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్, చిరంజీవి వంటి వాళ్లు రాజకీయాల్లో ఫెయిలయ్యారని స్వామి అన్నారు. ఇక కరుణానిధి, ఎంజీఆర్, జయలలితలు తమిళనాడును నాశనం చేశారని స్వామి విమర్శించారు.

కామరాజ్ నాడర్ తమిళనాడుకు ఎంతో చేశారని, ఆయన రాష్ట్రాన్ని సద్గతిలో పెడితే సినిమా వాళ్లు అంతా కలిసి రాష్ట్రాన్ని నాశనం చేశారని స్వామి అన్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడాన్ని తమిళ అతివాద పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయని, వాటితో తనకు సంబంధం లేదని, వ్యక్తిగతంగా సినిమా వాళ్ల రాజకీయ రంగ ప్రవేశాన్ని తాను వ్యతిరేకిస్తానని స్వామి స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.