యాప్నగరం

వెయ్యి సాంటా క్లాజాలతో అద్భుత సైకత శిల్పం

ఒడిశాకు చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఇసుకతో మరో అద్భుతాన్ని సృష్టించారు.

TNN 24 Dec 2016, 6:40 pm
ఒడిశాకు చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఇసుకతో మరో అద్భుతాన్ని సృష్టించారు. ఈ మేరకు శనివారం పూరీ తీరంలో 1000 ఇసుక సాంటా క్లాజాలను రూపొందించారు. క్రిస్మస్ సందర్భంగా నిర్మించిన ఈ సైకత శిల్పం ద్వారా ప్రపంచానికి సుఖ సంతోషాలు అందించాలని దేవున్ని ప్రార్థించారు. ఈ వెయ్యిమంది ఇసుక సాంటా క్లాజాలు జనవరి 1 వరకు పూరీ తీరంలో కొలువు దీరుతారు.
Samayam Telugu sudarsan pattnaik creates 1000 santa clauses at puri beach for world record
వెయ్యి సాంటా క్లాజాలతో అద్భుత సైకత శిల్పం


నిజానికి ఈ సైకత శిల్పం ద్వారా మరోసారి ప్రపంచ రికార్డు నెలకొల్పాలని సుదర్శన్ సంకల్పించారు. ఈ మేరకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి సమాచారం కూడా ఇచ్చారు. మరో ప్రపంచ రికార్డును నెలకొల్పడానికి 1000 సాంటా క్లాజాలను నిర్మిస్తున్నానని, ఇప్పటికే 800 పూర్తయ్యాయని, రేపు సాయంత్రానికి మొత్తం పూర్తవుతుందని శుక్రవారం సుదర్శన్ ట్వీట్ చేసారు. అయితే ఈ సైకత శిల్పం రికార్డులకెక్కిందా అనే విషయంపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు.
I am attempting for another #WorldRecord by creating 1000 #SandSanta at Puribeach. More than 800 completed. Tomorrow evening will be opened pic.twitter.com/udyVjfHCvF — Sudarsan Pattnaik (@sudarsansand) December 23, 2016

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.