యాప్నగరం

‘మదర్‌’ కోసం సుదర్శన్ సైకత శిల్పం

మదర్ థెరిసాకు సెయింట్ హుడ్ అందిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పాన్ని రూపొందించారు..

TNN 4 Sep 2016, 3:27 pm
భారతరత్న, నోబెల్ శాంతి బహుమతి విజేత మదర్ థెరిసాకు నేడు వాటికన్ సిటీలో రోమన్ కేథలిక్ చర్చి పోప్ ఫ్రాన్సిస్ సెయింట్‌హుడ్ బహూకరించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కెనానైజేషన్‌ను వీక్షించేందుకు లక్షల సంఖ్యలో ప్రజలు వాటికన్ చేరుకున్నారు.1997లో మరణించిన మదర్‌ను పోప్ రెండవ సెయింట్ జాన్‌పాల్ 2003లోనే పవిత్రమూర్తిగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం భారత్ నుంచి విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ నేతృత్వంలోని 12 మంది ప్రతినిధుల బృందం రోమ్ వెళ్లింది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం రోమ్ చేరుకున్నారు. మదర్ థెరిసాకు సెయింట్‌హుడ్ ఇస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ మదర్‌‌ సైకత శిల్పాన్ని రూపొందించారు.
Samayam Telugu sudarsan pattnaik sand art for motheer theresa
‘మదర్‌’ కోసం సుదర్శన్ సైకత శిల్పం



తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.