యాప్నగరం

దోమల నివారణపై పిటిషన్.. సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

దోమలను నిర్మూలించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ పని దేవుళ్లకే సాధ్యమవుతుందని వ్యాఖ్యానించింది. దేశంలో దోమలను నిర్మూలించే దిశగా కేంద్రానికి ఆదేశాలివ్వాలని కోరుతూ ధనేశ్ లేష్‌ధన్ అనే వ్యక్తి భారత సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశాడు. శుక్రవారం (సెప్టెంబర్ 22) ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. ‘మీరు అడిగిన పనిని దేవుళ్లు మాత్రమే చేయగలరు..

TNN 23 Sep 2017, 6:34 pm
దోమలను నిర్మూలించాలంటూ దాఖలైన ఓ అసాధారణ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ పని దేవుళ్లకే సాధ్యమవుతుందని వ్యాఖ్యానించింది. దేశంలో దోమలను నిర్మూలించే దిశగా కేంద్రానికి ఆదేశాలివ్వాలని కోరుతూ ధనేశ్ లేష్‌ధన్ అనే వ్యక్తి భారత సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశాడు. శుక్రవారం (సెప్టెంబర్ 22) ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. ‘మీరు అడిగిన పనిని దేవుళ్లు మాత్రమే చేయగలరు. మేం దేవుళ్లం కాదు.. దేవుళ్లు మాత్రమే చేసే పనుల్ని చేయమని మమ్మల్ని అడగొద్దు’ అని కోర్టు వ్యాఖ్యానించింది.
Samayam Telugu supreme court dismisses the unusual petition on mosquitoes
దోమల నివారణపై పిటిషన్.. సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు


కొన్ని పనులు కోర్టులు చేయలేవని, దోమలను నిర్మూలించాలని అధికారులను ఏ కోర్టు ఆదేశించలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ‘దేశంలోని ప్రతి ఇంటికెళ్లి.. మీ ఇంట్లో ఈగ, దోమ ఉంది.. వాటిని నిర్మూలించండి అని చెప్పలేం కదా?’ అంటూ న్యాయమూర్తులు పిటిషనర్‌ను ప్రశ్నించారు.

జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. దోమలను పారదోలే పని తమ పరిధిలోని అంశం కాదని ఆ పిటిషన్‌ను కొట్టేస్తూనే.. వాటి కారణంగా చోటు చేసుకుంటున్న మరణాలకు బాధ్యత వహించాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ప్రపంచవ్యాప్తంగా 7,25,000 మంది మరణాలకు కారణమవుతున్న దోమలను నివారించే అంశంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పటికే హెచ్చరించింది. ప్రాణాంతక మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, జికా తదితర వైరస్‌లను వ్యాప్తి చేస్తూ అవి పెద్ద సంఖ్యలో మరణాలకు కారణమవుతున్నాయని హెచ్చరించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.