యాప్నగరం

పశువుల అమ్మకాల నిషేదంపై నోటీస్

పశువుల్ని వ్యవసాయానికి తప్ప ఇతర ఏ అవసరాల కోసం (మాంసం కోసం) అమ్మరాదని ఇటీవల కేంద్రం

Samayam Telugu 15 Jun 2017, 3:55 pm
పశువుల్ని వ్యవసాయానికి తప్ప ఇతర ఏ అవసరాల కోసం (మాంసం కోసం) అమ్మరాదని ఇటీవల కేంద్రం విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ అంశంపై రెండు వారాల్లో స్పందన తెలియజేయాలని సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 11న చేపట్టాలని నిర్ణయించింది.
Samayam Telugu supreme court issues notice to the centre on cattle ban notification
పశువుల అమ్మకాల నిషేదంపై నోటీస్


పశువుల అమ్మకాలపై కేంద్రం విధించిన నిషేదాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్ కు చెందిన ఓ స్వచ్చంధ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేంద్రం వివరణ విన్న తర్వాతే ఈ అంశంపై తగు నిర్ణయం తీసుకుంటామని జస్టిస్ ఆర్కె అగర్వాల్, ఎస్ కే కౌల్ ల ధర్మాసనం స్పష్టం చేసింది.

దేశమంతా పశువుల అమ్మకాలు, కొనుగోలుపై నియంత్రణ ఉండాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కేంద్రం తరఫున అడిషనల్ సొలిటర్ జనరల్ పీఎస్ నరసింహ్మా హాజరై వివరించారు.
కేంద్ర నిర్ణయాన్ని నిరసిస్తూ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గళమెత్తిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.