యాప్నగరం

శశికళకు మరోసారి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళకు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆరోగ్యం బాగోలేనందున లొంగిపోయేందుకు

Samayam Telugu 15 Feb 2017, 10:53 am
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళకు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆరోగ్యం బాగోలేనందున లొంగిపోయేందుకు తనకు నాలుగు వారాల గడువు ఇవ్వాలని శశికళ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
Samayam Telugu supreme court rejects sasikalas plea
శశికళకు మరోసారి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ


అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు మంగళవారం శశికళను దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాను పెట్టుకున్న పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో శశికళ బుధవారం బెంగళూరులో జైలుకు వెళ్లనున్నారు. అగ్రహారం జైల్లో ఆమెతో పాటు ఆమె బంధువులు ఇళవరసి, సుధాకరన్ లు మూడున్నరేళ్లపాటు గడపనున్నారు.

ఈ కేసులో అన్నాడీఎంకే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.