యాప్నగరం

గోవధపై సుప్రీం కోర్టు తాజా వ్యాఖ్యలు

గోవధపై సుప్రీంకోర్టు మరోసారి స్పందించింది. గోవధను నిషేదించాలన్నా.. దాని మాంసం అమ్మకాలను ఆపేయాలన్నా పూర్తిగా రాష్ట్రాలు

Samayam Telugu 28 Jan 2017, 9:42 am
గోవధపై సుప్రీంకోర్టు మరోసారి స్పందించింది. గోవధను నిషేదించాలన్నా.. దాని మాంసం అమ్మకాలను ఆపేయాలన్నా పూర్తిగా రాష్ట్రాలు తీసుకోవాల్సిన నిర్ణయమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. గోవులను అక్రమంగా రాష్ట్రాలు తరలించడంపై కూడా ఆయా రాష్ట్రాలే తగు చర్యలు తీసుకోవాలని కోర్టు తెలిపింది.
Samayam Telugu supreme court says banning cow slaughter is upto states
గోవధపై సుప్రీం కోర్టు తాజా వ్యాఖ్యలు


దేశంలో కొన్ని రాష్ట్రాల్లో గోవధ, గోవువు అక్రమ రవాణ కొనసాగుతుందని..దేశమంతటా గోవధ నిషేదం అమలయ్యేలా ఆదేశించాలని వినీత్ సహాయ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

ఈ పిల్ పై చీఫ్ జస్టిస్ జెఎస్ ఖేహర్, జస్టిస్ ఎన్వీ రమణ స్పందించింది. ‘‘గోవధ, గోవుల అక్రమ రవాణాపై రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి అంశాల్లో మేం జోక్యం చేసుకోం’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.

అయితే కొన్ని రాష్ట్రాల్లో గోవధ నిషేదం ఉండి మరికొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉండటంతో గోవుల అక్రమ రవాణ కొనసాగుతుందని పిటిషనర్ తరఫున న్యాయవాది సర్వేష్ బిసారియా వాదించారు. అంతరాష్ట్ర పశువుల రవాణపై పాలసీ కూడా లేదని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

అయితే దీనిపై సీజేఐ స్పందిస్తూ..గతేడాది జూలైలోనే పశువుల అక్రమ రవాణపై ఇతర దేశాలకు తరలింపుపై చర్యలు తీసుకునేలా చట్టం చేయాలని కేంద్ర, రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశామని గుర్తు చేశారు.

కాగా, కేరళ, పశ్చిమ బెంగాల్, నాగలాండ్, మిజోరాం, మేఘాలయ, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం వంటి రాష్ట్రాల్లో గోవధతో పాటు రెస్టారెంటుల్లో బీప్ అమ్మకాలపై అనుమతి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.