యాప్నగరం

సుప్రీం కోర్టులో నితీశ్ ప్రభుత్వానికి ఊరట

నితీశ్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది.

TNN 7 Oct 2016, 5:58 pm
నితీశ్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. బీహార్‌లో విధించిన మద్య నిషేధం చట్ట విరుద్ధమని దాన్ని రద్దు చేస్తూ పాట్నా హైకోర్టు తీర్పునిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ నితీశ్ ప్రభుత్వం అక్టోబర్ 3న సుప్రీం కోర్టును ఆశ్రయించింది. వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం పాట్నా హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. మద్య నిషేధం, మానవ హక్కులు వేరు వేరు అంశాలని, ఒకదానితో ఒకటి ముడి పెట్టాల్సిన అవసరం లేదని సుప్రీం బెంచ్ వ్యాఖ్యానించింది.
Samayam Telugu supreme court stays patna high court order quashing liquor ban in bihar
సుప్రీం కోర్టులో నితీశ్ ప్రభుత్వానికి ఊరట

రాష్ట్రంలో మద్యం అమ్మడం, తాగడం నిషేధమని పేర్కొంటూ ఏప్రిల్ 5న బీహార్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఇది రాజ్యాంగ విరుద్ధమని, దీన్ని అమలు చేయడానికి వీల్లేదని పేర్కొంటూ ఆ జీవోను సెప్టెంబర్ 30న పాట్నా హైకోర్టు రద్దు చేసింది. కోర్టు తీర్పు వెలువడిన రెండు రోజుల తర్వాత అంటే గాంధీ జయంతి రోజున ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఇళ్లలో మద్యం తయారీకి ఉపయోగించే ముుడి సరుకులు దొరికితే ఇంట్లో ఉన్న పెద్దవారందరినీ అరెస్టు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.