యాప్నగరం

పౌరసత్వ సవరణ చట్టం.. పిటిషన్లపై నేడు సుప్రీంలో విచారణ

పౌరసత్వ సవరణ చట్టంపై దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు నేడు విచారించనుంది. ఈ చట్టం మత వివక్షను చూపుతోందని ఆరోపణలు వస్తున్న వేళ.. ముగ్గురు సభ్యుల ధర్మాసనం వాదనలను విననుంది.

Samayam Telugu 18 Dec 2019, 9:42 am
పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తూ.. సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను అత్యున్నత ధర్మాసనం బుధవారం విచారించనుంది. చీఫ్ జస్టిస్ ఎస్ఏ అబోడ్, జస్టిస్ బీఆర్ గవాయ్, సూర్యకాంత్‌లతో కూడిన ముగ్గురు సభ్యుల బెంచ్ ఈ పిటిషన్లపై వాదనలను విననుంది. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసిన వారిలో.. కాంగ్రెస్ పార్టీతోపాటు త్రిపుర మాజీ మహారాజు ప్రద్యోత్ కిశోర్ దేబ్ బర్మన్‌‌ ఉన్నారు.
Samayam Telugu supreme court


ఈ రెండు పిటిషన్లను అత్యవసరంగా విచారణ జరపాలని... వీటితోపాటు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా విచారించాలని సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వీ న్యాయస్థానాన్ని కోరారు.

పౌరసత్వ సవరణ చట్టం, 2019 ప్రకారం పాకిస్థాన్, బంగ్లాదేశ్, అప్ఘానిస్థాన్‌లకు చెందిన ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వం లభిస్తుంది. ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పౌరసత్వ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపిన తర్వాత.. డిసెంబర్ 12న రాష్ట్రపతి కోవింద్ సంతకం చేయడంతో చట్టంగా మారింది. ఇది మత వివక్షతో కూడిన చట్టమని కొందరు విమర్శిస్తున్నారు.

Read Also: ఆరునూరైనా పౌరసత్వ చట్టాన్ని అమలుచేసి తీరతాం: అమిత్ షా

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.