యాప్నగరం

అయోధ్యపై రేపే తుది తీర్పు.. దేశంలో హై అలర్ట్

Ram Janmabhoomi - Babri Masjid land వివాదంపై సుప్రీంకోర్టు శనివారం ఉదయం తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రముఖ నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Samayam Telugu 8 Nov 2019, 10:37 pm
యోధ్య అంశంపై తీర్పు వెలువరించడానికి సుప్రీంకోర్టు సిద్ధమైంది. యావత్‌ దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రామజన్మభూమి - బాబ్రీ మసీదు భూ వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం శనివారం (నవంబర్ 9) ఉదయం 10.30 గంటలకు తుది తీర్పు వెలువరించనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో శుక్రవారం రాత్రి వెల్లడించారు. అయోధ్య తీర్పు నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ విధించారు. రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీం ధర్మాసనం అయోధ్య భూ వివాదంపై కీలక తీర్పు చెప్పనుంది.
Samayam Telugu case
అయోధ్య తీర్పు


అయోధ్య తీర్పు నేపథ్యంలో దేశంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇప్పటికే అప్రమత్తత ప్రకటించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. అయోధ్య తీర్పు నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌లో హై అలర్ట్ విధించారు. పలు ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

Must Read: ఎమ్మార్వోను చంపడానికి కారణమిదే.. సురేశ్ భార్య లత సంచలన వ్యాఖ్యలు

కోట్లాది మంది హిందువులు, ముస్లింల మనోభావాలతో ముడిపడి ఉన్న విషయం కావడం వల్ల అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ముందస్తు సూచనలు చేసింది. ఈ మేరకు గురువారంమే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

తీర్పుపై ఎవరూ వివాదాస్పద రీతిలో బహిరంగ ప్రకటనలు చేయవద్దని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులకు ఇప్పటికే సూచించారు. ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఈ విషయంపై చర్చించారు. అయోధ్య తీర్పు నేపథ్యంలో అటు సోషల్ మీడియా వినియోగదారులకు పోలీసులు హెచ్చరికలు జారీచేసింది. తీర్పు వెలువడిన తర్వాత రెచ్చగొట్టే విధమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Also Read: ఛలో ట్యాంక్‌‌ బండ్‌కు అనుమతి నిరాకరణ.. జేఏసీ నేతల ముందస్తు అరెస్టు

అయోధ్య అంశంపై సుప్రీంకోర్టు ధర్మాసనం సుదీర్ఘంగా 40 రోజుల పాటు ఇరు పక్షాల వాదనలు వింది. అనంతరం అక్టోబర్ 16న తీర్పును రిజర్వులో పెడుతూ నిర్ణయం తీసుకుంది. తాాజాగా తుది తీర్పు వెలువరించడానికి సిద్ధమైంది. అయోధ్య అంశంపై తుది తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్.. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆ రాష్ట్ర డీజీపీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తీర్పు నేపథ్యంలోని పరిణామాలను దృష్టిలో ఉంచుకొని భద్రత చర్యలపై ఆరా తీసినట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.