యాప్నగరం

సుప్రీం కీలక నిర్ణయం.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యవసర కేసుల వాదన

కరోనా వైరస్ ప్రభావంతో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. లాయర్ల ఛాంబర్లను సీల్ చేస్తున్నట్లు సీజేేఐ ఎస్ఏ బోబ్డే తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యవసర కేసులను వాదించాలని నిర్ణయించింది.

Samayam Telugu 23 Mar 2020, 1:09 pm
దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుపైనా కరోనా వైరస్ ప్రభావం పడింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు కోర్టులో లాయర్ల చాంబర్లను సీల్ చేస్తున్నట్లు సీజేఐ ఎస్ఏ బోబ్డే తెలిపారు. లాయర్లు ఇంట్లో నుంచి వాదనలు వినిపించే అవకాశాన్ని సుప్రీం కోర్టు కల్పించింది. అత్యవసర కేసుల్లో వాదనలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించనున్నారు. ఢిల్లీ లాక్‌డౌన్ ప్రభావంతో అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. సుప్రీం కోర్టు గతంలోనే అప్రమత్తమైంది. మీడియా సహా కేసులతో సంబంధం లేని వారికి కోర్టు ప్రాంగణంలో ప్రవేశంపై నిషేధం విధించింది.
Samayam Telugu supreme court


కోవిడ్ భయంతో ఏప్రిల్ 4 వరకు సుప్రీంలో పని చేసే లాయర్లు విధులకు హాజరు కారని అడ్వొకేట్ అసోసియేషన్ ప్రకటించింది. ఢిల్లీని లాక్‌డౌన్ చేయడమే దీనికి కారణమని పేర్కొంది. బార్ సభ్యులు, ఆఫీస్ స్టాఫ్, సుప్రీం కోర్టు రిజిస్ట్రీ స్టాఫ్ కూడా ఏప్రిల్ 4 వరకు విధులకు హాజరు కాబోరు.

కరోనా వైరస్ కారణంగా ఢిల్లీ ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడంతోపాటు 144 సెక్షన్ అమలు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి 31 వరకు ఢిల్లీలో బస్సులు, మెట్రో, ట్యాక్సీలు, ఆటోలేవీ నడవవు. దేశీయ విమానాలు మాత్రం యథావిధిగా నడుస్తాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.