యాప్నగరం

వీధి వ్యాపారులకు కేంద్రం గుడ్ న్యూస్.. రేపే రూ.10వేల చొప్పున రుణాల పంపిణీ

PM Narendra Modi: కరోనా సంక్షోభంతో ఇబ్బందుల పాలైన వీధి వ్యాపారులను ఆత్మ నిర్భర భారత్ అభియాన్ పథకం కింద ఆదుకోవడానికి కేంద్రం నిర్ణయించింది. వీధి వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.10,000 పీఎం స్వనిధి స్కీమ్ కింద రుణాలు మంజూరు చేయనున్నారు.

Samayam Telugu 26 Oct 2020, 3:13 pm
రోనా సంక్షోభంతో కుదేలైన వీధి వ్యాపారులకు కేంద్రం తీపి కబురు అందించింది. PM SVANidhi (ప్రధాన్‌ మంత్రి స్ట్రీట్ వెండర్స్‌ ఆత్మనిర్భర్‌ నిధి యోజన) పథకం కింద వారికి రూ.10,000 చొప్పున రుణాలు అందించనుంది. మంగళవారం (అక్టోబర్ 27) వర్చువల్‌గా కొనసాగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ 3 లక్షల మంది లబ్ధిదారులకు స్వయంగా రుణాలు అందజేయనున్నారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడనున్నారు. వారిలో కొంత మందితో నేరుగా మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu పీఎం స్వనిధి రుణాలు (ప్రతీకాత్మక చిత్రం)
loans to street vendors under SVANidhi scheme (Representational Image)


కరోనా సంక్షోభం కారణంగా ఇబ్బందులకు గురైన వీధి వ్యాపారులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా జూన్ 1న వీధి వ్యాపారుల కోసం పీఎం స్వనిధి పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కింద వీధి వ్యాపారులు సబ్సిడీ రేటులో రూ.10,000 మూలధనాన్ని పొందవచ్చు.

Don't Miss: పీఎం స్వనిధి అర్హతలు, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

పీఎం స్వనిధి పథకం కింద రుణాల కోసం ఇప్పటికే 24 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 12 లక్షల మందిని రుణాల మంజూరికీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎంపిక చేసింది. 5.35 లక్షల మందికి ఇప్పటికే రుణాలు మంజూరు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ రుణం కోసం ఉత్తర్‌ ప్రదేశ్ రాష్ట్రం నుంచి దేశంలోనే అత్యధికంగా 5,57,000 మంది దరఖాస్తు చేసుకున్నారు.

Also Read: నా ఆరోగ్యం బాగానే ఉంది.. RBI యథావిధిగా పనిచేస్తుంది: శక్తికాంత దాస్

Must Read: అదే వాన, అంతే బీభత్సం.. ఈసారి బెంగళూరులో!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.