యాప్నగరం

ఎట్టకేలకు దొరికిన స్వాతి హంతకుడు

తమిళనాడులో సంచలనం సృష్టించిన స్వాతి హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

TNN 2 Jul 2016, 8:22 am
తమిళనాడులో సంచలనం సృష్టించిన స్వాతి హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సరిగ్గా హత్య జరిగిన వారం రోజుల తరువాత హంతకుడు దొరికాడు. అతని పేరు రామ్ కుమార్ గా గుర్తించారు. తిరునల్వేలిలోని ఇంట్లో దాక్కున్న రామ్ కుమార్ ను శుక్రవారం అర్థరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులను చూడగానే హంతకుడు తనను తాను చంపుకునేందుకు ప్రయత్నించాడు. బ్లేడుతో గొంతుకోసుకున్నాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికిలో చేర్చారు పోలీసులు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అతను ఇంజినీరింగ్ పూర్తి చేసి చిన్న ఉద్యోగం చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. స్వాతి నివాసానికి దగ్గర్లోని హాస్టల్ లో ఉంటున్నట్టు గుర్తించారు. స్వాతితో పరిచయం ఉందా లేదా?, అసలెందుకు చంపాడు అన్న విషయాలు రామ్ కుమార్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. చెన్నైలోని నుంగంబాక రైల్వే స్టేషన్లో జూన్ 24న స్వాతిని హత్య చేశాడు. అక్కడి సీసీటీవీ ఫుటేజీలో అతను వచ్చి వెళ్లిన విజువల్స్ రికార్డయ్యాయి.
Samayam Telugu swathi murderer arrested
ఎట్టకేలకు దొరికిన స్వాతి హంతకుడు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.