యాప్నగరం

నిజమే.. భారత్‌పై ఉగ్రదాడులు చేశాను: సలాహుద్దీన్

హిజ్బుల్ ముజాయిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే.

TNN 3 Jul 2017, 1:31 pm
భారత్‌పై ఉగ్రదాడులు జరిపిన మాట వాస్తవమేనని హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ అంగీకరించాడు. సలావుద్దీన్‌ను అమెరికా గతవారం అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన తర్వాత నిజాన్ని అంగీకరించడం గమనార్హం. ఓ పాకిస్థానీ టీవీ చానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తాను దాడులు ఎలా చేయించాండో వివరించాడు. అంతే కాదు తనను ఉగ్రవాదిగా ప్రకటించడం, అమెరికా వెర్రితనానికి నిదర్శనమని పేర్కొన్నాడు. ఇండియా నుంచి కశ్మీర్‌కు స్వాతంత్రం వచ్చేవరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశాడు. కశ్మీర్‌ లోయను భారత సైన్యానికి శ్మశానంగా మారుస్తానని గతేడాది హెచ్చరించాడు. మరోవైపు సలావుద్దీన్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించడం పట్ల పాకిస్థాన్ కూడా తప్పుబట్టింది. అతడు కశ్మీర్ ప్రజల హక్కులను కాపాడేందుకు కృషి చేస్తున్నాడంటూ ఘన స్వాగతం పలకిన సంగతి తెలిసిందే. అంతేకాదు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో పర్యటించిన సలాహుద్దీన్‌కు పాకిస్థాన్ ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించింది.
Samayam Telugu syed salahuddin boasts of carrying out terror attacks in india to pakistani channel
నిజమే.. భారత్‌పై ఉగ్రదాడులు చేశాను: సలాహుద్దీన్


భారత్ నుంచి కశ్మీర్‌కు స్వేచ్ఛ కలిగించడంలో తమ పోరాటం ఆగదని సలాహుద్దీన్ ఈ సందర్భంగా ప్రకటించారు. అంతేకాదు కశ్మీర్‌లో కేవలం భారత సైన్యాన్ని హిజ్బుల్ ముజాయిద్దీన్ మాత్రమే లక్ష్యంగా చేసుకుందని, ఐఎస్, అల్‌ఖైదాలు అక్కడ లేవని ప్రకటించాడు. డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాలను ఎవరైనా న్యాయస్థానంలో సవాల్ చేస్తే వాటిని పట్టించుకోరని, అలాగే ఇతర పశ్చిమ దేశాలు కూడా అతడి అభిప్రాయాలతో ఏకీభవించవని పేర్కోవడం గమనార్హం. స్వతంత్రంగా ఉండటానికి లేదా పాక్‌లో వీలీనానికి కశ్మీరీ ప్రజల అభిప్రాయం తెలుసుకోడానికి తీర్మానాలను ప్రతిపాదించాలని ఐక్యరాజ్యసమితిని కోరారు. రష్యా, లేదా చైనా దీనిపై హామీ ఇచ్చినట్లయితే భారత్‌తో శాంతిపూర్వక చర్చలకు హిజ్బుల్ ముజాయిద్దీన్ సిద్ధంగా ఉందని అన్నాడు. గతవారం అమెరికాలో పర్యటించిన భారత ప్రధాని నరేంద్రమోదీతో భేటీకి ముందు ట్రంప్ ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.