యాప్నగరం

దేశంలో కెల్లా ఎత్తైన జాతీయ జెండా ఇదే!

దేశంలోకెల్లా పొడవైన జాతీయ జెండాను ఆదివారం భారత్- పాక్ సరిహద్దులో ఆవిష్కరించారు. అంతర్జాతీయ సరిహద్దు దగ్గర ఆవిష్కరించిన ఈ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందట.

TNN 6 Mar 2017, 12:03 am
దేశంలోకెల్లా ఎత్తైన జాతీయ జెండాను ఆదివారం భారత్- పాక్ సరిహద్దులో ఆవిష్కరించారు. పంజాబ్‌లోని అటారీ-వాఘా సరిహద్దు దగ్గర 350 అడుగుల ఎత్తైన జెండా స్తంభంపై 120 అడుగుల పొడవు, 80 అడుగుల వెడల్పుగల త్రివర్ణ పతాకాన్నిఎగరేశారు. ఈ త్రివర్ణ పతాకం పాకిస్థాన్‌లోని లాహోర్ నుంచి కూడా కనపడుతుందట. జెండా స్థూపం కాంక్రీట్ బేస్‌ను 30 అడుగుల పొడవు, అంతే వెడల్పుతో నిర్మించారు.
Samayam Telugu tallest national flag hoisting in attari wagha border
దేశంలో కెల్లా ఎత్తైన జాతీయ జెండా ఇదే!


గతేడాది ఏప్రిల్‌లో పంజాబ్ క్యాబినెట్ మినిస్టర్ అనిల్ జోషి ఈ జెండా స్తంభానికి శంకుస్థాపన చేశారు. 2017 జనవరి నాటికి దీన్ని పూర్తిచేస్తామని ఆయన అప్పట్లో ప్రకటించారు. వేలాది మంది పర్యాటకులు విచ్చేసే అటారీ- వాఘా అంతర్జాతీయ సరిహద్దులో దేశంలో కెల్లా పొడవైన జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా చెక్కు చెదరకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఈ ప్రాజెక్ట్ కోసం రూ.3.5 కోట్ల ఖర్చు చేశారు. భవిష్యత్తులో ఈ జెండా నిర్వహణను ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు ఏఐటీ ఛైర్మన్ సురేశ్ మహాజన్ అన్నారు. ఇప్పటి వరకు 293 అడుగుల ఎత్తున రాంచీలో ఉన్న జాతీయ జెండానే దేశంలో కెల్లా ఎత్తైనదిగా పేరు గాంచింది. ఈ త్రివర్ణ పతాకం ఆవిష్కరణపై పాక్ రెంజర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. అంతే కాదు దీన్ని గూఢచర్యానికి వినియోగిస్తారని కూడా ఆరోపిస్తున్నాయట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.