యాప్నగరం

కరోనా టీకా ఉచితంగా ఇస్తాం: తమిళనాడు సీఎం

Tamil Nadu: కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అందరికీ ఉచితంగా అందిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. బిహార్ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ప్రకటన వెంటనే ఆయన ప్రకటన చేయడం గమనార్హం.

Samayam Telugu 22 Oct 2020, 7:09 pm
రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేయిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. దేశంలో ఇలాంటి ప్రకటన చేసిన తొలి సీఎంగా నిలిచారు. బిహార్‌ ప్రజలందరికీ కొవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా వేయిస్తామని బీజేపీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన గంటల వ్యవధిలోనే తమిళనాడు ముఖ్యమంత్రి కూడా అదే తరహా ప్రకటన చేయడం గమనార్హం. అయితే.. తమిళనాడులోనూ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే.
Samayam Telugu తమిళనాడు ముఖ్యమంత్రి
CM Palaniswami


‘కొవిడ్ టీకా వ‌చ్చిన వెంటనే దాన్ని రాష్ట్ర ప్రజ‌లందరికీ ఉచితంగా వేయిస్తాం’ అని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి పేర్కొన్నారు. గురువారం ‘అక్టోబర్ 22’ సాయంత్రం ఈ ప్రకటన చేశారు. వ‌చ్చే ఏడాది ఆరంభంలో త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌లు జరుగనున్నాయి.

మరోవైపు.. ఫ్రీ కరోనా వ్యాక్సిన్‌పై విపక్షాలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఎన్నికలు వస్తున్నాయనగానే ఓటర్లను ఆకర్షించుకోవడానికి ఇలాంటి ప్రకటనలు చేస్తారని విమర్శిస్తున్నారు. ఓటు వేస్తే టీకా ఇస్తారా అంటూ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ కరోనా వ్యాక్సిన్ ఫ్రీ’ అంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.

Also Read: రూ.500కే కరోనా టెస్ట్.. ఇక మరింత సులభం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.