యాప్నగరం

గవర్నమెంట్ బస్సులో తమిళనాడు సీఎం... తన ఏడాది పాలనపై ఆరా..!

తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ ప్రభుత్వ బస్సులో ప్రయాణించారు. బస్సు పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో మాట్లాడారు. తన ఏడాది పాలనపై ప్రశ్నించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కరుణానిధి, అన్నాదురై‌ స్మారకాలకు నివాళులు అర్పించారు. కాగా గత ఏడాది డీఎంకే అధికార పగ్గాలను చేపట్టింది. అప్పట నుంచి ప్రభుత్వం ప్రజల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టింది.

Authored byAndaluri Veni | Samayam Telugu 7 May 2022, 2:46 pm

ప్రధానాంశాలు:

  • ఏడాది పాలన పూర్తి చేసుకున్న డీఎంకే ప్రభుత్వం
  • కరుణానిధి, అన్నాదురై‌లకు నివాళులు అర్పించిన సీఎం
  • అసెంబ్లీలో కీలక ప్రకటనలు చేసిన స్టాలిన్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu బస్సులో స్టాలిన్
తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా ఆ రాష్ట్రం సీఎం ఎంకే స్టాలిన్ శనివారం ఉదయం బస్సులో ప్రయాణించారు. చెన్నైలోని గవర్నమెంట్ బస్సు ఎక్కి.. పనితీరును పరిశీలించారు. తన ఏడాది పాలన గురించి ప్రయాణికులు, బస్సు కండక్టర్‌తో కూడా మాట్లాడారు. ప్రభుత్వ పాలనపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
బస్సులో మెరీనా బీచ్‌‌కు చేరుకుని.. తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, డీఎంకే వ్యవస్థాపకుడు సీఎన్ అన్నాదురై స్మారకాల దగ్గరకు వెళ్లి నివాళులు అర్పించారు. అనంతరం అసెంబ్లీలో స్టాలిన్ ఐదు కీలక ప్రకటనలు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదు తరగతుల విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌ను ప్రకటించారు. స్కూల్స్ ఆఫ్ ఎక్స‌లెన్స్‌, విద్యార్థులకు వైద్య పరీక్షలు, ప‌ట్ట‌ణ కేంద్రాల్లో పీహెచ్‌సీల ఏర్పాటుపై కూడా ప్ర‌క‌ట‌న చేశారు. అలాగే అన్ని నియోజకవర్గాల్లో సీఎం అనే పథకాన్ని కూడా ప్రకటించారు.


కాగా డీఎంకే గతేడాది మే ఏడో తేదీన అధికారంలోకి వచ్చింది. దాదాపు పదేళ్ల తర్వాత పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే సొంతంగా 133 సీట్లు గెలుచుకుంది. అలాగే ఈ ఫిబ్రవరిలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించింది. స్టాలిన్ 2006- 2011లో కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.