యాప్నగరం

తమిళనాడులో జులై 31 వరకు లాక్‌డౌన్ పొడిగింపు

కరోనా కేసులు పెరుగుతున్న వేళ తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను జులై 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

Samayam Telugu 30 Jun 2020, 12:52 am
రోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంటున్నాయి. త‌మిళ‌నాడులో జులై 31 వ‌ర‌కు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం (జూన్ 29) ప్రక‌టించింది. గ్రేట‌ర్ చెన్నై ప‌రిధిలోని చెన్నై, కాంచిపురం, చెంగ‌ల్‌పట్టు, తిరువ‌ళ్లువార్ ప్రాంతాల్లో జులై 5 వ‌ర‌కు క‌ఠినంగా లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంటుంద‌ని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రేట‌ర్ చెన్నై పోలీస్ లిమిట్స్‌తో పాటు మధురైలోనూ జులై 5 వ‌ర‌కు పూర్తి స్థాయి లాక్‌డౌన్ కొన‌సాగుతుంద‌ని తెలిపింది.
Samayam Telugu తమిళనాడు కరోనా వైరస్
Tamil Nadu Coronavirus


రాష్ట్రవ్యాప్తంగా జులై 31 వ‌ర‌కు స‌డ‌లింపుల‌తో కూడిన లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంటుందని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే మ‌హారాష్ట్రతో పాటు జార్ఖండ్, అసోం తదితర రాష్ట్రాలు జులై 31 వ‌ర‌కు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి.

మరోవైపు.. క‌రోనా క‌ట్టడి కోసం విధించిన నాలుగో విడ‌త లాక్‌డౌన్ గ‌డువు జూన్ 30తో ముగియ‌నుండగా.. కేంద్రం కీలక ప్రకటన చేసింది. కంటెయిన్‌మెంట్ జోన్లలో జులై 31 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇతర జోన్లలో మరిన్ని కార్యకలాపాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోమవారం రాత్రి అన్‌లాక్ 2.0 మార్గదర్శకాలను విడుదల చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.