యాప్నగరం

జయను పరామర్శించిన ఇన్‌ఛార్జి గవర్నర్

తమిళనాడు ఇన్‌ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు శనివారం చెన్నై అపోలో ఆసుపత్రికి వెళ్లారు.

TNN 22 Oct 2016, 4:40 pm
తమిళనాడు ఇన్‌ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు శనివారం చెన్నై అపోలో ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులతో జయ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు రాజ్‌భవన్ ఓ స్టేట్ మెంట్ ను విడుదల చేసింది. గవర్నర్ జయ చికిత్స పొందుతున్న వార్డు దగ్గరికి వెళ్లి చూసి వచ్చారని స్టేట్ మెంట్ లో అధికారులు పేర్కొన్నారు . ఆమె ఆరోగ్యం మరింత మెరుగవ్వడంతో గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేసినట్టు అందులో ఉంది. మెరుగైన వైద్యాన్ని అందిస్తున్న డాక్టర్ల బృందాన్ని గవర్నర్ మెచ్చుకున్నారు కూడా. సెప్టెంబర్ 22న జయలలిత ఆసుపత్రిలో చేరగా గవర్నర్ ఆమెను పరామర్శించడానికి వెళ్లడం ఇది రెండో సారి.
Samayam Telugu tamil nadu governor visited apollo hospitals to enquire jayas health
జయను పరామర్శించిన ఇన్‌ఛార్జి గవర్నర్


కాగా అపోలో ఆసుపత్రి ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డి జయకు అందిస్తున్న చికిత్స గురించి గవర్నర్‌కు వివరించారు. ఉత్తమ వైద్య బృందం జయకు చికిత్స చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆ బృందంలో సీనియర్ కార్డియాలజిస్టు, సీనియర్ రెస్పిరేటరీ ఫిజీషియన్, ఎండో క్రినాలజిస్టు, డయాబెటాలజిస్టు, డైటీషియన్ ఉన్నట్టు చెప్పారు.

గవర్నర్ విద్యాసాగరరావు ఆసుపత్రికి రాగానే తమిళ మంత్రులు తంబిదొరై, పన్నీర్ సెల్వం, తంగమణి, వేలుమణి, విజయ్ భాస్కర్ స్వాగతం పలికి లోనికి తీసుకెళ్లారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.