యాప్నగరం

కరోనా వ్యాక్సిన్ వేసుకొని మద్యం సేవించకండి... ఆరోగ్య మంత్రి కీలక వ్యాఖ్యలు

తిరుచ్చికి చేరుకున్న టీకాను విజయ భాస్కర్ పరిశీలించారు.అక్కడ నుంచి పలు మండలాలకు ఆయన జెండా ఊపి తరలించారు.

Samayam Telugu 14 Jan 2021, 1:37 pm
మరో రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కరోనా టీకా విషయమై తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి విజయ భాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా టీకా వేసుకొని మద్యం సేవించరాదని విజయభాస్కర్‌ సూచించారు. చెన్నైకు చేరుకున్న కరోనా టీకాను రాష్ట్రవ్యాప్తంగా 10 మండలాలకు మంగళవారం తరలించారు అధికారులు. తిరుచ్చికి చేరుకున్న టీకాను ఖాజామలై ప్రాంతంలో ఉన్న ఆరోగ్యశాఖ సహాయ డైరెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో భద్రపరిచారు.
Samayam Telugu కరోనా వ్యాక్సిన్


ఈ కేంద్రాన్ని బుధవారం ఉదయం ఆరోగ్యశాఖ మంత్రి డా.సి.విజయభాస్కర్‌ పరిశీలించారు. ఆయనతో పాటు పర్యాటక శాఖ మంత్రి వెల్లమండి ఎన్‌.నటరాజన్‌, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌.వలర్మతి, కలెక్టర్‌ శివరాజు తదితరులున్నారు. తిరుచ్చి నుంచి ఇతర జిల్లాలకు టీకాలను తరలిస్తున్న ప్రత్యేక వాహనాలను మంత్రి విజయభాస్కర్‌ జెండా పూపి ప్రారంభించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 16వ తేదీ టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభించనున్నామని తెలిపారు.

కరోనా టీకా రాష్ట్రంలోని పది మండలాలకు తరలించి, అక్కడి నుంచి జిల్లాలకు ప్రత్యేక వాహనాల ద్వారా తరలిస్తున్నామన్నారు. టీకా వ్యవహారమై సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను ప్రజలు నమ్మరాదని, నిరాధారమైన వదంతులు సృష్టిస్తున్న వారిపై కఠినచర్యలు చేపడతామని మంత్రి హెచ్చరించారు. ఇటు తెలుగు రాష్ట్రాలకు కూడా కరోనా వ్యాక్సిన్ చేరుకున్న విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.