యాప్నగరం

వధువు కావలెను... పెళ్లి కోసం ఊరంతా పోస్టర్లు..!

తమిళనాడులో ఓ అబ్బాయి తన పెళ్లి కోసం నానా పాట్లు పడుతున్నాడు. ఐదేళ్లుగా తనకు తగ్గ సంబంధం రాకపోవడంతో విసిగిపోయాడు. దాంతో పోస్టర్లు, బ్యానర్లు కొట్టించి.. ఊరంతా అతికించాడు. అయినా సరే సంబంధాలు రావడం లేదంటే. అయితే ఈ ప్రయంత్నంతో వైరల్ అయిపోయాడు. ఈయన బ్యానర్లు, పోస్టర్లపై చాలా మీమ్స్‌ కూడా వస్తున్నాయి. అయినా ఆ అబ్బాయి వెనకడుగు వేయడం లేదు. తన ప్రయత్నాన్ని ఆపేది లేదని ఇలా ప్రయత్నిస్తూనే ఉంటానని అంటున్నాడు.

Authored byAndaluri Veni | Samayam Telugu 27 Jun 2022, 5:59 pm

ప్రధానాంశాలు:

  • తమిళనాడు అబ్బాయి వినూత్న ప్రయత్నం
  • వివరాలతో బ్యానర్లు అతికించిన జగన్
  • ఐదేళ్లుగా కుదరని సంబంధాలు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu వధువు కావలెను... పెళ్లి కోసం ఊరంతా పోస్టర్లు..!
పెళ్లి కోసం ఎవరైనా బంధువులతో చెప్పి సంబంధాలు చూసుకుంటారు.. లేదా మ్యారేజ్ బ్యూరోలపై ఆధారపడతారు. కానీ పెళ్లి కోసం ఓ అబ్బాయి మాత్రం.. వేరే రూట్‌‌ను ఎంచుకున్నాడు. తనకు పిల్ల కావాలంటూ నగరమంతా పోస్టర్లు వేశాడు. దీంతో ఈ విషయం తెగ వైరల్ అవుతుంది. తమిళనాడులో ఇది జరిగింది. మధురైలోని విల్లుపురానికి చెందిన ఎంఎస్.జగన్ (27) ఈ వినూత్న చర్యకు పూనుకున్నాడు. ఓ కంపెనీలో మేనేజర్‌గా, డిజైనర్‌గా కూడా పనిచేస్తున్న జగన్ ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దానికోసం తన వివరాలను తెలియజేస్తూ అంటే తన పేరు, వయస్సు, ఉద్యోగం, జీతం, కులం, నక్షత్రం వంటి వివరాలను ఇచ్చి.. తనకు వధువు కావలెను అని పోస్టర్లు, బ్యానర్లు వేయించాడు.
ఆ పోస్టర్లు, బ్యానర్లను నగరంలోని ప్రధాన కూడళ్లలో వేయించాడు. అందులో తనకు కొంత భూమి కూడా ఉందని పేర్కొన్నాడు. అయితే ఎన్నో సంబంధాలను చూశానని, కానీ ఒక్కరూ కూడా తనకు సరైన జోడీని తీసుకురాలేదని అందుకే ఇలా ప్రయత్నిస్తున్నట్టు జగన్ చెప్పుకొచ్చాడు. " నేను ఐదు సంవత్సరాలుగా వధువు కోసం వెతుకుతున్నాను. కానీ విజయవంతం కాలేదు. నేను చాలా పోస్టర్‌లను డిజైన్ చేశాను. నేను నా కోసం ఒకదాన్ని ఎందుకు డిజైన్ చేయకూడదని అనుకున్నాను." అని జగన్ అన్నారు. అలాగే పెళ్లి సంబంధాల విషయంలో 90లో పుట్టిన వారికి ఇది కఠినమైన కాలమేనని అన్నారు.

అలాగే తన పోస్టర్‌లపై ఎగతాళి చేస్తున్నారని, తాను పట్టించుకోనని జగన్ అన్నారు. తన పోస్టర్‌లపై మీమ్స్‌ కూడా చేస్తున్నారని, దాని వల్ల తనపై ఎలాంటి ప్రభావం పడలేదని అన్నారు. తన ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంటానని అంటున్నాడు. అయితే ఇలా పోస్టర్‌లు పెట్టిన పెద్ద ప్రయోజనం లేకపోయిందట. ఏం సంబంధాలు రాలేదంట, కేవలం పెళ్లి బ్రోకర్లు మాత్రమే ఫోన్‌లు చేస్తున్నారంట. కాగా గత మార్చి నెలలో లండన్‌లో ఓ వ్యక్తి పెళ్లి కోసం బిల్‌బోర్డులను పెట్టించాడు. భారతీయ సంతతికి చెందిన జీవన్ భచు ట్యూబ్ స్టేషన్‌లో రెండు భారీ బిల్‌బోర్డులను ఏర్పాటు చేశాడు. 31 ఏళ్ల తనకు భార్య కావాలంటూ ప్రకటన ఇచ్చుకున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.