యాప్నగరం

ప్రభుత్వం పడిపోతే పోటీకి సిద్ధం: రజినీకాంత్

సూపర్ స్టార్ రజినీకాంత్ శుభవార్త చెప్పారు. తమిళనాడు అసెంబ్లీకి పోటీకి సిద్ధమని ప్రకటించారు. త్వరలోనే పార్టీ పేరు, విధివిధానాలు వెల్లడించే అవకాశం ఉంది.

Samayam Telugu 19 Apr 2019, 6:07 pm
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తమిళనాడు అసెంబ్లీకి పోటీ చేస్తామని తెలిపారు. శుక్రవారం (ఏప్రిల్ 19) మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోటీకి సిద్ధమని ప్రకటించారు. ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ఒకవేళ మెజారిటీ లేక అన్నాడీఎంకే ప్రభుత్వం పడిపోతే.. ఆ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల సమరంలో బరిలోకి దిగుతారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. రజినీ ఔనని సమాధానం చెప్పారు.
Samayam Telugu rajini
రజినీకాంత్


అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ ఎప్పుడు వచ్చినా పోటీకి సిద్ధమని రజినీకాంత్ స్పష్టం చేశారు. మే 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాల దీనిపై స్పష్టమైన నిర్ణయం వెలువరిస్తానని ఆయన తెలిపారు. ఈలోగా పార్టీ పేరు, విధివిధానాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

తమిళ తళైవా రజినీకాంత్.. రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించి ఏడాది పైనే అవుతున్నా.. ఇప్పటివరకు పార్టీ పేరు, విధివిధానాలపై స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన చేసిన ప్రకటన అభిమానుల్లో ఉత్సాహం నింపింది. మరోవైపు.. అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ ‘మక్కల్ నీది మయ్యం’ పేరుతో పార్టీ ప్రకటించి ప్రచార కార్యక్రమాలు కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. రజనీ ప్రకటనను ఆయన స్వాగతించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.