యాప్నగరం

జల్లికట్టు: ఎద్దుల స్వాధీనం, విడుదల

స్వాధీనం చేసుకున్న ఎద్దులను కాసేపు తమ ఆధీనంలో ఉంచుకున్న పోలీసులు అనంతరం వాటిని విడుదల చేశారు.

TNN 16 Jan 2017, 2:38 pm
మధురైలోని అలుంగనెళ్లూరులోని జల్లికట్టులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ అలుంగు నెళ్లూరులో జల్లికట్టు నిర్వహించారు గ్రామస్థులు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై రాళ్లు రువ్వి, దాడి చేశారు. దీంతో భారీగా పోలీసులు మోహరించి గ్రామస్థులను చితక్కొట్టారు. అలాగే ఎద్దులను స్వాధీనం చేసుకుని అక్కణ్నించి తరలించారు. పోలీసులు ఎద్దులను తరలిస్తుండగా గ్రామస్థులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. వారిపైనా లాఠీఛార్జ్ చేశారు పోలీసులు. దీంతో పలువురికి గాయాలయ్యాయి.
Samayam Telugu tamilandu jallikattu bulls released at alanganallur
జల్లికట్టు: ఎద్దుల స్వాధీనం, విడుదల


స్వాధీనం చేసుకున్న ఎద్దులను కాసేపు తమ ఆధీనంలో ఉంచుకున్న పోలీసులు అనంతరం వాటిని విడుదల చేశారు. కాసేపటి తరువాత ఎద్దులను విడుదల చేశారు. అలుంగునళ్లూరు ప్రస్తుతం పోలీసుల పహారాలో ఉంది.

కాగా మధురై జిల్లా కలెక్టర్ వీర రాఘవరావు మాట్లాడుతూ ప్రస్తుతం అక్కడి పరిస్థితి పూర్తిగా తమ ఆధీనంలో ఉందని చెప్పారు. తాము దగ్గరుండి పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.