యాప్నగరం

ఉద్యోగ సమాచారం కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

ఉపాధి అవకాశాలకి సంబంధించిన స్పష్టమైన పూర్తి సమాచారం సేకరణ కోసం కేంద్రం కొత్తగా ఓ టాస్క్ ఫోర్స్‌ని...

TNN & Agencies 11 May 2017, 11:59 pm
ఉపాధి అవకాశాలకి సంబంధించిన స్పష్టమైన పూర్తి సమాచారం సేకరణ కోసం కేంద్రం కొత్తగా ఓ టాస్క్ ఫోర్స్‌ని ఏర్పాటు చేసింది. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డా. అరవింద్ పణగారియా నేతృత్వం వహిస్తున్న ఈ కమిటీలో కార్మిక శాఖ కార్యదర్శి సత్యవతి, స్టాటిస్టిక్స్ విభాగం కార్యదర్శి డా.టీసీఏ అనంత్, నీతి ఆయోగ్‌కి చెందిన ప్రొఫెసర్ పులక్ ఘోష్, ఆర్బీఐ బోర్డ్ సభ్యుడు మనీష్ సభార్వల్ వంటి వాళ్లు సభ్యులుగా వున్నారు.
Samayam Telugu task force has been created to update employment data
ఉద్యోగ సమాచారం కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు


ఉద్యోగ అవకాశాలని పెంపొందిస్తూ, విశ్వసనీయమైన సమాచారాన్ని సేకరించే దిశగా ప్రభుత్వంలోని వివిధ శాఖల సమన్వయంతో పనిచేయనున్న ఈ టాస్క్ ఫోర్స్ ఎప్పటికప్పుడు ఉద్యోగాలకి సంబంధించిన సమాచారాన్ని అప్‌డేట్ చేసి ప్రభుత్వానికి పలు సూచనలు, సిఫార్సులు చేయనుంది. లేబర్ బ్యూరో వంటి పలు ఏజెన్సీలు ఉపాధి కల్పన, అవకాశాలపై సమాచారం అందిస్తున్నప్పటికీ.. ఆ సమాచారంలో పూర్తిస్థాయి విశ్వసనీయత కొరవడిందనే అసంతృప్తి, లోటు అలా వుండిపోయాయి. ఈ కారణంగానే విధానాల రూపకల్పనలో పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని మోడీ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే స్పష్టమైన, విశ్వసనీయమైన సమాచారం ఆధారంగా అత్యంత ప్రాధాన్యతా క్రమంలో విధివిధానాల రూపకల్పన జరగాలని సూచిస్తూ ప్రధాని జారీచేసిన ఆదేశాల ప్రకారమే ప్రధాని కార్యాలయం ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.