యాప్నగరం

మోదీ సాబ్ గడ్డం గీసుకోండి.. ప్రధానికి రూ.100 పంపిన ఛాయ్‌వాలా!

Baramati Chaiwala దేశంలో కరోనా కష్టాల నుంచి ప్రజలను బయటపడేయడానికి చర్యలు తీసుకోవాలని, ఉద్యోగాలు, ఉపాధిని కల్పించాలని కోరుతూ ఓ ఛాయ్‌వాలా మోదీకి లేఖ రాశాడు.

Samayam Telugu 10 Jun 2021, 4:22 pm

ప్రధానాంశాలు:

  • ప్రజలను కష్టాల నుంచి బయటపడేయాలని సూచన.
  • ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలని లేఖ రాసిన చాయ్‌వాలా.
  • ప్రధాన మంత్రిపై గౌరవం ప్రదర్శిస్తూనే చురకలు.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ప్రధాని మోదీ
గతేడాది కరోనా వైరస్ కట్టడికి లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ గడ్డం పెంచుతున్నారు. ఏడాదిన్నరగా ఆయన గడ్డం గీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన ఓ ఛాయ్‌వాలా.. మోదీకి రూ.100 పంపి గడ్డం గీసుకోవాలని కోరాడు. బారామతికి చెందిన అనిల్ మోరే అనే టీ అమ్ముకునే వ్యక్తి ప్రధానికి రూ.100లతో పాటు లేఖను పంపాడు. దేశ ప్రధానిని అవమానించడం, బాధపెట్టడటం తన ఉద్దేశం కాదని, కరోనాతో పేదలు పడుతున్న కష్టాలను ఆయనకు తెలియజేయాలనుకున్నా అని అనిల్ తన లేఖలో వివరించాడు.
లాక్‌డౌన్ వల్ల కలిగిన ఇబ్బందుల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించాలని, అందరికీ వేగంగా టీకాలు వేయించాలని కోరాడు. ‘‘ఒకవేళ ఏదైనా వృద్ధిచెందాలి అనుకుంటే దేశంలో ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి.. వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలి.. వైద్య సౌకర్యాల కల్పనపై దృష్టిసారించి చర్యలు తీసుకోవాలి.. చివరి రెండు లాక్‌డౌన్‌ల వల్ల కలిగిన కష్టాల నుంచి ప్రజలను బయటపడేయడానికి ప్రధాని నిర్ణయం తీసుకోవాలి’’ అని అనిల్ మోరే డిమాండ్ చేశారు.

‘‘ప్రధానమంత్రి దేశంలోనే అత్యున్నత పదవి... ప్రధానిపై నాకు ఎనలేని గౌరవం.. అభిమానం ఉంది.. ఆయన గడ్డం గీసుకోడానికి నేను దాచుకున్న డబ్బుల్లో నుంచి రూ.100 పంపుతున్నాను.. ప్రధాని శక్తివంతమైన నేత.. అవమానించడం నా ఉద్దేశం కాదు.. కానీ, కరోనా కారణంగా పేదల కష్టాలు రోజు రోజుకూ మరింత పెరుగుతున్నాయి.. వాటిపై దృష్టిసారించాలి’’ అని అనిల్ కోరారు.

అంతేకాదు, కరోనాతో చనిపోయినవారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఆర్ధిక సాయం ప్రకటించాలని పేర్కొన్నాడు. ప్రధాని మోదీ దృష్టి ఆకర్షించాలనే ఉద్దేశంతోనే రూ.100తోపాటు లేఖ పంపినట్టు తెలిపాడు. బారామతి పట్టణం ఇందాపూర్ రోడ్డులో ఉన్న ఓ ప్రయివేట్ ఆస్పత్రి ఎదురుగా అనిల్ మోరే ఓ చిన్న టీ దుకాణం నడపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.