యాప్నగరం

Bihar Teachers Leave Letter డిసెంబరు 5న మా అమ్మ చనిపోతుంది.. సెలవు కావాలి: విస్తుగొలిపే కారణాలతో లీవ్

Bihar Teachers Leave Letter జిల్లా కలెక్టర్, కమిషనర్లు ప్రభుత్వ ఉపాధ్యాయుల సీఎల్‌కు సంబంధించి వెలువరించిన ఉత్తర్వులపై టీచర్లు వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు. కారణం చెప్పి సీఎల్ తీసుకోవడానికి ముందే దరఖాస్తు చేసుకోవాలని ఆయన ఆదేశాలు జారీచేశారు. దీనిపై అయోమయంలో ఉన్న ఉపాధ్యాయులు.. ఆగ్రహం చెందుతున్నారు. అనారోగ్యం గురించి, అత్యవసర పని గురించి ముందుగానే ఎలా చెప్పగలమని మండిపడుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా వింత కారణాలతో సెలవు చీటీలు రాస్తున్నారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 5 Dec 2022, 7:01 am

ప్రధానాంశాలు:

  • ఉద్యోగుల సీఎల్ దరఖాస్తుపై కలెక్టర్ ఉత్తర్వులు
  • తీవ్రంగా మండిపడుతున్న ఉపాధ్యాయులు
  • వింత వింత కారణాలతో లీవ్ లెటర్లతో నిరసన
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu leave Letter
Bihar Teachers Leave Letter బిహార్‌లో కొందరు ఉపాధ్యాయులు లీవ్ లెటర్‌లో రాసిన కారణాలు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాంకా జిల్లాలోని కచారి పిప్రా గ్రామానికి చెందిన అజయ్‌ కుమార్‌ అనే ఉపాధ్యాయుడు..‘మా అమ్మ ఈ నెల 5న రాత్రి 8 గంటలకు చనిపోతారు. అంత్యక్రియల కోసం.. 6, 7 తేదీల్లో నాకు సెలవు కావాలి. దయచేసి సెలవు ఇవ్వండి’ అని ప్రిన్సిపాల్‌కు లీవ్ లెటర్ రాశాడు. అలాగే, బరాహత్‌లోని ఖాదియారా ఉర్దూ విద్యాలయ ఉపాధ్యాయుడు రాజ్‌ గౌరవ్‌.. త్వరలో తాను ఆరోగ్యానికి గురవుతానని, అందుకే ఈ నెల 4, 5 తేదీల్లో సెలవు కావాలి’ అని సెలవు చీటీ రాయడం గమనార్హం.
కటారియాకు చెందిన నీరజ్‌ కుమార్‌ అనే ఉపాధ్యాయుడు క్యాజువల్ లీవ్ (సీఎల్) కోసం లేఖ రాస్తూ..‘నేను వివాహానికి వెళ్లాలి.. అక్కడ విందు భోజనం బాగా చేస్తాను. కాబట్టి నాలుగు రోజులు కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది. అందుకు డిసెంబరు 7న సెలవు మంజూరు చేయండి’అని కోరారు. ఇలాంటి వింత కారణాలతో లీవ్‌ లెటర్‌లు రాయడం వెనుక భాగల్‌పూర్ కమిషనర్ దయానిధిన్ పాండే ఇటీవల వెలువరించిన ఉత్తర్వులే కారణం. సెలవు తీసుకోవడానికి ముందే దరఖాస్తు చేసుకోవాలని ఆయన ఆదేశాలు జారీచేశారు.


ఉత్తర్వులపై అయోమయంలో ఉన్న ఉపాధ్యాయులు.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆగ్రహంతో ఉన్న ఉపాధ్యాయులు అనారోగ్యం గురించి, అత్యవసర పని గురించి ముందుగానే ఎలా చెప్పగలమని ఇలాంటి సెలవు చీటీలు రాయడం గమనార్హం. విచిత్రమైన రీతిలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వెంటనే ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ముంగేర్, భాగల్పూర్, బంకా జిల్లాల్లోని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇటువంటి లీవ్ లెటర్లు రాస్తున్నారు.

ముంగేర్ జిల్లా విద్యాశాఖ అధికారి సురేశ్ ప్రసాద్ సింగ్ మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్, కమిషనర్ నవంబరు 24న ఈ ఉత్తర్వులు వెలువరించారని, దీంతో విద్యాశాఖకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఈ ఉత్తర్వులను మేము కేవలం పాటించడం వరకే తమ విధని తెలిపారు. అయితే, ఇటువంటి వింత కారణాలతో సెలవు చీటి మీకు అందిందా? అంటే చెప్పడానికి నిరాకరించారు.

Read Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.