యాప్నగరం

అబ్బాయి అనుమానాస్పద మృతి.. ‘అమ్మాయి ముద్దు’తో అడ్డం తిరిగిన కథ

పదిహేనేళ్ల బాలుడు తల్లిదండ్రులతో కలసి ఉంటున్నాడు. ఇటీవల పరీక్షల్లో ఫెయిలైన బాలుడు.. అనూహ్యంగా శవమై కనిపించాడు. అమ్మాయికి ముద్దు పెడుతూ దొరికిపోయిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Samayam Telugu 12 May 2021, 6:08 pm
పదిహేనేళ్ల బాలుడు అనుమానాస్పద స్థితిలో చనిపోవడం మిస్టరీగా మారింది. మర్డర్ కేసు నమోదు చేసిన పోలీసులకు ప్రాథమిక విచారణలో ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. బాలుడు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తూ చనిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే అనూహ్యంగా అమ్మాయితో ముద్దు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కొద్దిరోజుల ముందు ఓ టీనేజ్ బాలికకి ముద్దు పెడుతూ దొరికిపోయాడని తల్లిదండ్రులు చెప్పడంతో కేసు చిక్కుముడి పడింది. ఇంతకీ బాలుడిది హత్యా? ఆత్మహత్యా? ఈ షాకింగ్ ఘటన ముంబైలో జరిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
kiss


కండివాలీ ఈస్ట్ ఏరియా సమతానగర్ పోలీస్ స్టేషన్‌లో పరిధిలో మిస్టరీ మరణం చోటుచేసుకుంది. పదిహేనేళ్ల బాలుడు అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. హనుమాన్‌నగర్‌కి చెందిన బాలుడు(15) తల్లిదండ్రులతో కలసి ఉంటున్నాడు. ఏడో తరగతి ఫెయిలైన బాలుడు.. అనూహ్యంగా కాలనీలోని గుడి సమీపంలో శవమై కనిపించాడు. తలకి గాయాలై ఉండడంతో పోలీసులు మర్డర్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

అయితే కొద్దిరోజుల ముందే ఓ టీనేజ్ యువతికి ముద్దు పెడుతూ దొరికిపోయాడని.. ఆమె కుటుంబ సభ్యులు దాడి చేసి చంపేస్తామని బెదిరించారని తల్లిదండ్రులు చెప్పడంతో మరణం మిస్టరీగా మారింది. బాలిక కుటుంబ సభ్యులు కొట్టి చంపేశారా? లేక బెదిరింపులకు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడా? అనే విషయం తేలాల్సి ఉంది. సంఘటన స్థలం సమీపంలోని అన్ని సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. అనుమానాస్పదంగా ఎలాంటి కదలికలు లేవని గుర్తించారు.

తాను ఆత్మహత్య చేసుకుంటానని కొద్దిరోజులుగా బాలుడు తన స్నేహితులతో చెప్పి వాపోయాడని.. ఈ క్రమంలో ఉరేసుకుని సూసైడ్ చేసుకునేందుకు యత్నించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. చెట్టుకు ఉరేసుకునేందుకు ప్రయత్నించి ప్రమాదవశాత్తూ రాయిపై పడి దెబ్బ తగిలి చనిపోయి ఉంటాడని అనుమానిస్తున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన అనంతరం బాలుడి మరణంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పారు. కేసు విచారణలో ఉంది.

Also Read: అలా చేస్తే కరోనా మూడో వేవ్ భారత్‌ను తాకదు.. మహిళా మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
Read Also:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.