యాప్నగరం

పొలిటీషియన్‌తో ప్రేమ పెళ్లి.. పార్లమెంట్‌లో అడుగుపెట్టిన తెలుగు హీరోయిన్

తెలుగులో శీను వాసంతి లక్ష్మీ, మహారథి లాంటి చిత్రాల్లో నటించిన నవనీత్ కౌర్ ఎంపీగా గెలుపొందారు. అమరావతి నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచిన ఆమె పార్లమెంట్‌లో అడుగుపెట్టారు.

Samayam Telugu 19 Jun 2019, 6:51 pm
నవనీత్ కౌర్.. ఈ పేరు గుర్తుందా? శీను వాసంతి లక్ష్మీ, మహారథి లాంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన ఈమె.. పార్లమెంటరీయన్‌గా మారిపోయారు. మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఆమె.. ఐదుసార్లు ఎంపీగా పని చేసిన సీనియర్ నాయకుడిని ఓడించి మరీ ఆమె గెలవడం విశేషం. నవనీత్ కౌర్ శివసేన సీనియర్ నేత ఆనందరావు విఠోబాను ఓడించారు. 2014 ఎన్నికల్లో శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ నుంచి పోటీ చేసి ఓడిన ఆమె.. ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు.
Samayam Telugu navneet karu


బాబా రాందేవ్‌ను ఫాలో అయ్యే నవనీత్ కౌర్‌కు యోగా క్యాంపులో రాజకీయ నాయకుడైన రవి రాణాతో పరిచయం ఏర్పడింది. తర్వాత 2011లో బాబా రాందేవ్ సమక్షంలోనే వాళ్లిద్దరూ పెళ్లాడారు. అలా ఆమెకు రాజకీయాలతో అనుబంధం ఏర్పడింది. ఆమె భర్త రవి రాణా బద్నేరా నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఇండిపెండెంట్‌గా విజయం సాధించడం గమనార్హం. ఈ సెగ్మెంట్ అమరావతి లోక్ సభ పరిధిలోకి రావడం కౌర్‌కు కలిసొచ్చింది.

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు రవి రాణా మంచి స్నేహితుడు. దీంతో బీజేపీ తరఫునే పోటీ చేసే వీలున్నప్పటికీ.. శివసేనతో పొత్తు కారణంగా అది వీలుపడదు. మోదీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమనే అంచనాతో.. ఎన్సీపీ నుంచి పోటీ చేయడం మంచిది కాదనే భావనతో నవనీత్ కౌర్ ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. అంతకు ఏడాది ముందు నుంచే జనం మధ్యన ఉండి వారితో మమేకమయ్యారు. మొత్తాన్ని పొలిటీషియన్‌ను పెళ్లి చేసుకొని.. హీరోయిన్ కూడా పొలిటీషియన్ అయిపోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.