యాప్నగరం

కశ్మీర్‌: ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్ల మృతి

BSF: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. పికెటింగ్‌లో ఉన్న ఇద్దరు జవాన్లపై ఒక్కసారిగా కాల్పులు జరిపి పారిపోయారు. ఈ దాడిలో ఇద్దరు బీఎస్‌ఎఫ్ జవాన్లు అమరులయ్యారు.

Samayam Telugu 20 May 2020, 11:12 pm
Samayam Telugu నమూనా చిత్రం
Kashmir Terror Attack
మ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. ముష్కరమూకల దుశ్చర్యలో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. జమ్మూకశ్మీర్‌లోని గండెర్బల్‌ జిల్లాలోని పండాచ్ ప్రాంతంలో బుధవారం (మే 20) ఈ దారుణం జరిగింది. గండెర్బల్ నగర పరిసరాల్లో బీఎస్‌ఎఫ్ జవాన్లు పికెటింగ్ నిర్వహిస్తుండగా.. నగరానికి 17 కి.మీ. దూరంలోని పండాచ్‌ ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు ముష్కరులు ఒక్కసారిగా కాల్పులు జరిపి పారిపోయారు. దీంతో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన జవాన్లను సౌరా ప్రాంతంలోని స్కిమ్స్‌ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. జవాన్లను పరిశీలించిన వైద్యులు అప్పటికే ఒకరు మరణించినట్లు తెలిపారు. మరో జవాన్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. అమరులైన ఇద్దరు జవాన్ల వయసు 35, 36 ఏళ్లు అని అధికారులు తెలిపారు.

ఈ ఘటన అనంతరం ఆ ప్రాంతంలో హై అలర్ట్ విధించారు. పారిపోయిన ముష్కరుల కోసం భారత భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: పాక్‌కు షాకిచ్చిన తాలిబన్.. కశ్మీర్ అంశంపై కీలక ప్రకటన

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.